ETV Bharat / sports

ఇలాంటి రోజులు వస్తాయనుకోలేదు:హనుమ విహారి - ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌

జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు టీమ్ఇండియా బ్యాట్స్​మన్ హనుమ విహారి. తన కెరీర్‌లో ఎక్కువసార్లు టాప్‌ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌ చేశానని, కాబట్టి ఆ పరిస్థితులకు అలవాటు పడ్డానని తెలిపాడు.

vihari
vihari
author img

By

Published : May 15, 2021, 5:30 AM IST

Updated : May 15, 2021, 10:34 AM IST

భారత టెస్టు జట్టులో ఒకడిగా.. కొన్ని అద్భుత పోరాటాల్లో పాలుపంచుకున్న మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి.. ఇప్పుడు తన జట్టుతో కలిసి మరో పోరాటంలో ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. దేశంలో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చిన వేళ.. తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్నాడు. కౌంటీల్లో ఆడడానికి ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న ఈ తెలుగు క్రికెటర్‌.. తన బృందం చేస్తున్న సేవ గురించి, రాబోయే ఇంగ్లాండ్‌ సిరీస్‌తో పాటు మరికొన్ని విషయాలపై మాట్లాడాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతితో అల్లాడుతోన్న ప్రజలను చూస్తుంటే బాధగా ఉంది. ఈ వైరస్‌ మరింత బలంగా తన రూపాన్ని మార్చుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స కోసం పడక కూడా దొరకని పరిస్థితి తలెత్తుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇలాంటి రోజులు వస్తాయని అనుకోలేదు. ఈ సంక్షోభ సమయంలో నా వంతు సాయంగా మిత్రులు, సామాజిక మాధ్యమాల్లో నన్ను అనుసరించే వాళ్లతో కలిసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయంగా నిలవాలనుకున్నా. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న మిత్రులు, అనుచరులను వాలంటీర్లుగా మార్చి ఓ బృందాన్ని ఏర్పాటు చేశా. ప్లాస్మా, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌, అవసరమైన మందులు దొరకక ఇబ్బందులు పడుతున్న వాళ్లకు అండగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా సాయం కోరుతున్న వాళ్లకు వీలైనంత త్వరగా మా బృందం సహకరిస్తోంది. మా ప్రయత్నాన్ని చూసి స్ఫూర్తి పొందిన చాలా మంది నాకు తోడుగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఆక్సిజన్‌ కావాలంటూ, పడక దొరకలేదంటూ లేదా ఇంకేదో ఇబ్బంది గురించి నాకు వచ్చిన వినతులను వాళ్లకు పంపిస్తా. నా భార్య, సోదరి, ఆంధ్ర జట్టులోని కొంతమంది ఆటగాళ్లు నాకు మద్దతుగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు చేస్తుంది సరిపోదు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా.
మళ్లీ ఓపెనర్‌గా..: 2018-19 ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనర్‌గా ఆడా. రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ జట్టు కోరితే మళ్లీ ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు నేను సిద్ధం. జట్టు ఏం అడిగినా చేస్తా. నా కెరీర్‌లో నేనెక్కువగా టాప్‌ఆర్డర్‌లోనే ఆడాను కాబట్టి ఆ సవాలు నాకేం కొత్త కాదు. గాయం కారణంగా నేను జట్టుకు దూరమైన సమయంలో వచ్చిన అవకాశాలను వాషింగ్టన్‌ సుందర్‌ చక్కగా ఉపయోగించుకున్నాడు. అతను గొప్పగా రాణించడం సంతోషంగా ఉంది. కానీ నా ఆటపైనే నేను పూర్తి దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. నా చేతుల్లో ఉన్నవాటినే నియంత్రించేందుకు ప్రయత్నిస్తా. నా బౌలింగ్‌పైనా శ్రద్ధ పెట్టా. ఆఫ్‌ బ్రేక్‌ బంతులు సమర్థంగా వేసేందుకు శ్రమిస్తున్నా. వార్విక్‌షైర్‌ తరపున కౌంటీల్లో మూడు మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఇంగ్లాండ్‌కు వచ్చా.

ఇక్కడ కొత్త సీజన్‌ ఆరంభ దశలో ఉన్నందున పరిస్థితులు సవాలు విసురుతున్నాయి. అయితే మంచి అనుభవాన్ని సొంతం చేసుకున్నా. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి, పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోవాలనే ఆలోచనతోనే వచ్చా. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆ తర్వాత ఇంగ్లిష్‌ జట్టుతో టెస్టుల్లో ఈ అనుభవం ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఉన్నా.

ఇదీ చూడండి: ఆ విషయం నా చేతుల్లో లేదు: విజయ్ శంకర్

Last Updated : May 15, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.