Neeraj Chopra Latest Video : భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సేదదీరుతున్న అతడు.. అక్కడ సందర్శించిన ప్రదేశాల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా స్కై డైవింగ్ చేసిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. దీనికి "ఆకాశం హద్దే కాదు.." అనే క్యాప్షన్‌ను జతచేశాడు. ఆకాశం మధ్యలో విమానం నుంచి దూకే సమయంలో నీరజ్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ వీడియో మొత్తంలో చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌ను ఆస్వాదించాడు. రెండు రోజుల్లోనే ఈ వీడియోకు దాదాపు నాలుగు లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.
నీరజ్ 13 నెలల వ్యవధిలో ఒలింపిక్స్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో రజతం, డైమండ్‌లీగ్ ట్రోఫీని సాధించి చరిత్ర సృష్టించాడు. ఇటీవల జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి పతకం దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ బెర్తును కూడా నీరజ్ ఖరారు చేసుకున్నాడు. 90 మీటర్ల పైన జావెలిన్‌ను విసిరే సత్తా ఉన్న వాద్లిచ్ లాంటి స్టార్ ఆటగాడిని టోక్యో ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకు నీరజ్ అయిదుసార్లు వెనక్కినెట్టడం విశేషం.
స్పైడర్ కెమెరాతో సరదాగా రోహిత్ శర్మ.. టీ20 అంటేనే నరాలుతెగేంత ఉత్కంఠకు నిలయం. ఆ ఫార్మాట్‌కు పాపులారిటీ పెరిగే కొద్దీ పోటీ కూడా తీవ్రమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆటగాళ్లు ఒత్తిడికి దూరంగా ఉంటారు. అప్పుడే మైదానంలో రాణించగలుగుతారు. ఇటీవల ముగిసిన ఆసియాకప్ టీ20 సిరీస్‌లో భారత ఆటగాళ్లు సరదాగా గడిపిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. సూపర్4 దశలోఅఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరిగిన రోజున ఆటగాళ్లు మైదానంలో స్పైడర్ కెమెరాతో సరదాగా ఆడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. రాజస్థాన్ లీగ్ జట్టు ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, మెంటల్ కండీషనింగ్ కోచ్ అప్టన్ దేని కోసమో ఎదురుచూస్తున్నట్లు నిలబడి ఉండగా.. స్పైడర్ కెమెరా వారి వద్దకు వస్తుంది. ఆ కెమెరాను పట్టుకొనేందుకు ముగ్గురు ఒక్కసారిగా పరిగెత్తే సరికి.. అది తుర్రుమని వెళ్లిపోతుంది. మరో క్లిప్‌లో యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా సరదాగా కెమెరాను బెదిరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరవిహారం చేసి 61 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఊరిస్తున్న 71వ అంతర్జాతీయ శతకాన్ని అందుకొన్నాడు.
-
Wait for our Ultra legend pro max 😍😂pic.twitter.com/CCy7q1HHiG
— Rajasthan Royals (@rajasthanroyals) September 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wait for our Ultra legend pro max 😍😂pic.twitter.com/CCy7q1HHiG
— Rajasthan Royals (@rajasthanroyals) September 14, 2022Wait for our Ultra legend pro max 😍😂pic.twitter.com/CCy7q1HHiG
— Rajasthan Royals (@rajasthanroyals) September 14, 2022
ఇదీ చదవండి: బీసీసీఐ రాజ్యాంగ సవరణకు సుప్రీం ఓకే.. గంగూలీ, షా '2.0' షురూ
మాజీ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు.. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్ణయం