ETV Bharat / sports

గ్రాండ్​గా నవ్​దీప్ సైనీ పెళ్లి - అమ్మాయి ఎవరంటే? - Navdeep Saini International Career

Navdeep Saini Marriage : టీమ్ఇండియా బౌలర్ నవ్​దీప్ సైనీ వివాహం చేసుకున్నాడు. గురువారం కుటుంబ సభ్యుల సమక్షంలో తన ప్రేయసి స్వాతి అస్తానా మెడలో మూడు ముళ్లు వేశాడు.

navdeep saini marriage
navdeep saini marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 9:57 AM IST

Updated : Nov 24, 2023, 1:03 PM IST

Navdeep Saini Marriage : టీమ్ఇండియా పేసర్ నవ్​దీప్ సైనీ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తన గర్ల్​ఫ్రెండ్, యూట్యూబర్​ స్వాతి అస్తానాను గురువారం పెళ్లాడాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు సైనీ. "నీతో ఉంటే ప్రతిరోజు ప్రేమ ఉంటుంది. ఎప్పటికీ కలిసి ఉండాలని మేము ఈరోజు నిర్ణయించుకున్నాం. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెడుతున్న మాకు.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి" అని సైనీ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

పెళ్లి వేడుకలో నవ్​దీప్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ఇక అతడి సహచర క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్, మోసిన్ ఖాన్, రాహుల్ తెవాటియా, ఉమ్రాన్ మాలిక్​తో సహా పలువురు సెలెబ్రిటిలు, ఫ్యాన్స్​ సోషల్ మీడియా వేదికగా నవ్​దీప్​కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Navdeep Saini IPL Career : హరియాణాకు చెందిన 30 ఏళ్ల నవ్​దీప్​.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్​)​తో వెలుగులోకి వచ్చాడు. అతడు 2017లో ఐపీఎల్​లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, అప్పుడు దిల్లి క్యాపిటల్స్ ( అప్పటి దిల్లి డేర్ డెవిల్స్) జట్టులో ఉన్న నవ్​దీప్​కు బరిలో దిగే ఛాన్స్ దక్కలేదు. తర్వాత 2018 సీజన్​లో నవ్​దీప్​ను.. రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. మూడేళ్ల పాటు ఆర్​సీబీతో ఉన్న అతడు గతేడాది రాజస్థాన్ రాయల్స్​ జట్టుతో చేరాడు. మొత్తంగా ఐపీఎల్​ కెరీర్​లో 32 మ్యాచ్​లు ఆడిన నవ్​దీప్ 23 వికెట్లు పడగొట్టాడు.

Navdeep Saini International Career : 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవ్​దీప్.. ఇప్పటివరకు 2 టెస్టు, 8 వన్డే, 11 టీ20 మ్యాచ్​లు ఆడాడు. మూడు ఫార్మాట్​లలో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు. అతడు 2021 జూలైలో చివరిసారిగా టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లిన నవ్​దీప్ అక్కడ జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో బరిలో దిగాడు.

పెళ్లిపీటలెక్కనున్న టీమ్​ఇండియా ప్లేయర్ వెంకటేశ్​ అయ్యర్-​ ఎంగేజ్​మెంట్ ఫొటోలు చూశారా?

కళ్లు చెదిరే బైక్‌ కలెక్షన్స్‌.. 'ఎందుకు మహీ..?' అంటూ సాక్షి..

Last Updated : Nov 24, 2023, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.