ETV Bharat / sports

'నేను ఇక జాతీయ జట్టుకు ఆడలేనేమో' - దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్

దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్(Chris Morris News).. తమ జాతీయ జట్టుకు ​గుడ్​ బై చెప్పే సమయం వచ్చేసిందని అన్నాడు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేనని తెలిపాడు. తమ దేశ క్రికెట్​ బోర్డుతో దాదాపు ఏడాది నుంచి సంబంధాలు లేవని చెప్పాడు.

chris morris
క్రిస్ మోరిస్
author img

By

Published : Oct 28, 2021, 5:42 PM IST

అంతర్జాతీయ క్రికెట్​కు తాను వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని అన్నాడు దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్ క్రిస్​ మోరిస్(Chris Morris News). రిటైర్మెంట్​ను అధికారికంగా ప్రకటించడం ఇష్టం లేదని అన్నాడు. జట్టులో కొనసాగే ఉద్దేశం తనకులేదని, ఈ విషయం తమ బోర్డుకు కూడా తెలుసని ఓ క్రీడా ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

"దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఆటకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించను. నేనేంటో నాతో సహా క్రికెట్ సాతాఫ్రికాకూ తెలుసు. ఇకపై జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించలేను."

--క్రిస్ మోరిస్, దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్​లో క్రిస్ మోరిస్​.. తుది జట్టుకు ఎంపిక అవ్వలేదు(Chris morris south africa news). ఈ నేపథ్యంలోనే మోరిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇకపై దేశవాళీ క్రికెట్, టీ20 లీగ్​లపైనే దృష్టి సారిస్తానని మోరిస్ చెప్పుకొచ్చాడు. 'దేశవాళీ జట్టులో ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. దక్షిణాఫ్రికా జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. అది నాకు దక్కిన గొప్ప అవకాశం.' అని మోరిస్ అన్నాడు. దాదాపు ఏడాది నుంచి సౌతాఫ్రికా క్రికెట్​ బోర్డుతో తనకు సంబంధాలు లేవని వెల్లడించాడు. ఆ దేశ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య జరిగిన వివాదంపై తనకు అవగాహన లేదని చెప్పాడు.

2012 నుంచి అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మోరిస్.. 42 వన్డేలు, 23 టీ20లు, 4 టెస్టు మ్యాచ్​లు ఆడాడు. 2019 వరల్డ్​ కప్​లో దక్షిణాఫ్రికా తరఫున చివరిసారిగా ఆడాడు.

ఇదీ చదవండి:

డికాక్​ క్షమాపణలు.. తర్వాతి మ్యాచ్​లకు అందుబాటులోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.