Muthiah Muralidaran About Bowling: శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ దాదాపు రెండు దశాబ్దాలు తన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించాడు. రిటైర్మెంట్ తర్వాత ఆటకు దూరం కాకుండా ఏదో ఒక రోల్లో మురళీధరన్ గ్రౌండ్లో కనిపిస్తుంటాడు. గత కొన్నేళ్లుగా తన కామెంటరీతోనూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలు స్పోర్ట్స్ ఛానెల్స్‌లో అనేక ఇంటర్వ్యూల్లో, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో పాల్గొన్నాడు. అయితే రీసెంట్గా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న మురళీధరన్ పేస్ బౌలింగ్‌ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
'150 స్పీడ్ (Kmph)తో బౌలింగ్ చేయడం అసలైన క్రికెట్ కాదు. క్రికెట్ అంటే అంతకుమించి ఉంటుంది. ఒక పేస్ బౌలర్‌కు స్లో బాల్స్ ఎలా వేయాలో తెలిసి ఉండాలి. దాంతోపాటు కటర్, నకుల్, యార్కర్, స్లో యార్కర్ ఇలా అన్ని వేరియేషన్స్‌తో బౌలింగ్ చేయగలగాలి. పేస్‌లో స్పీడ్ మాత్రమే కాకుండా ఈ మెలకువలు ఉన్నప్పుడే ఎవరైనా కంప్లీట్ బౌలర్ అవుతారు. నా దృష్టిలో బుమ్రా పర్ఫెక్ట్ బౌలర్. అతడు ఈజీగా 145 స్పీడ్ (Kmph)తో యార్కర్ వేయగలడు' అని మురళీధరన్ అన్నాడు.
-
Bowling 150 KMPH is not a Cricket
— Richard Kettleborough (@RichKettle07) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
- Muttiah Muralitharan#HappyNewYear2024 #Devara #DavidWarner #AUSvPAK #INDvSA #HappyNewYear #Welcome2024 pic.twitter.com/vX67lW8CYG
">Bowling 150 KMPH is not a Cricket
— Richard Kettleborough (@RichKettle07) January 1, 2024
- Muttiah Muralitharan#HappyNewYear2024 #Devara #DavidWarner #AUSvPAK #INDvSA #HappyNewYear #Welcome2024 pic.twitter.com/vX67lW8CYGBowling 150 KMPH is not a Cricket
— Richard Kettleborough (@RichKettle07) January 1, 2024
- Muttiah Muralitharan#HappyNewYear2024 #Devara #DavidWarner #AUSvPAK #INDvSA #HappyNewYear #Welcome2024 pic.twitter.com/vX67lW8CYG
Muthiah Muralidaran Career: 1991లో అరంగేట్రం చేసిన మురళీధరన్ దాదాపు రెండు దశాబ్దాలపాటు శ్రీలంక జట్టుకు సేవలందించాడు. అతజి కెరీర్లో 133 టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు క్రికెట్లో టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మురళీధరన్ కొనసాగుతున్నాడు. ఇక 350 వన్డేల్లో 534, టీ20ల్లో 13, ఐపీఎల్లో 63 వికెట్లు తీశాడు. 2010లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
Muthiah Muralidaran Biopic: స్టార్ డైరెక్టర్ ఎంఎస్ శ్రీపతి, స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కెరీర్ ఆధారంగా '800 ది మూవీ' తెరకెక్కించారు. మురళీధరన్ జీవితాన్ని వెంటాడిన ఎన్నో సమస్యలు, చేదు అనుభవాలు, వివాదాలను ఈ సినిమా ద్వారా చూపించారు దర్శకుడు శ్రీపతి. బుకర్ ప్రైజ్ విన్నర్ స్నేహన్ కరుణాతిలక చిత్రానికి రైటర్‌గా వ్యవహరించగా, మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి చిత్రాన్ని నిర్మించారు. ఆక్టోబర్ 6న ఈ సినిమా పాన్ఇండియా లెవెల్లో రిలీజైంది.
మురళీధరన్ @800 - టెస్ట్ క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన వీరులు వీళ్లే!