బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్(mushfiqur rahim latest news) వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(bangladesh cricket board). సెలక్షన్ ప్యానెల్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన రహీమ్‌కు షోకాజ్ నోటీసులు అందించింది.
2021-23 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నేపథ్యంలో పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ తరఫున ఆడేందుకు ముష్ఫికర్‌కు అవకాశం లభించలేదు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ నుంచి కూడా ముష్ఫికర్‌ను దూరం పెట్టింది బంగ్లా బోర్డు. అతడికి విశ్రాంతి ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహీమ్(mushfiqur rahim news) బంగ్లా సెలక్షన్ ప్యానెల్‌పై పలు వ్యాఖ్యలు చేశాడు.
"టీమ్ నుంచి నన్ను తప్పిస్తున్నట్లు వారు నిజం చెప్పి ఉండాల్సింది. ఆటగాడి ప్రదర్శనలో హెచ్చుతగ్గులు సహజమే. ఫిట్నెస్ విషయంలోనూ విమర్శలొస్తుంటాయి. మరో ఆటగాడి కోసం చూస్తున్నామని బోర్డు స్పష్టంగా చెప్పి ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని." అని ముష్ఫికర్ రహీమ్ అన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో రహీమ్ పేలవ ప్రదర్శన చేశాడు. స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లోనూ అతడు విఫలమయ్యాడు. దీంతో పాకిస్థాన్‌తో సిరీస్‌కు అతడికి అవకాశమివ్వలేదు బంగ్లాదేశ్ సెలక్షన్ ప్యానెల్.
ఇదీ చదవండి: