Mumbai Teen 72 Hours Batting: 72 గంటలకు పైగా ఏకధాటిగా నెట్ సెషన్లో బ్యాటింగ్ చేసి రికార్డు నెలకొల్పాడు ముంబయికి చెందిన క్రికెటర్ సిద్ధార్థ్ మోహితే. అంతకుముందు 2015లో విరాగ్ మనే అనే క్రీడాకారుడి పేరుమీద ఉన్న 50 గంటల రికార్డును అధిగమించాడు. నెట్సెషన్లో ప్రతి గంటకు ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకుని ఈ రికార్డు నెలకొల్పాడు మోహితే. ప్రస్తుతం గిన్నిస్ బుక్ ఆఫ్ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నాడు.
"నేను దేనికోసమైతే ప్రయత్నిస్తున్నానో అది సాధించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాలో ఏదో ఉందని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది." అని మోహితే ఓ ప్రెస్ రిలీజ్లో పేర్కొన్నాడు.
కరోనా వల్ల రెండేళ్లపాటు క్రికెట్కు దూరంగా ఉన్నానని వాపోయాడు మోహితే. ఈ సారి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నానని.. అందుకే ఇలా అత్యధిక గంటల పాటు నెట్లో బ్యాటింగ్ చేశానని చెప్పుకొచ్చాడు మోహితే.
మోహితే కోచ్ జ్వాలా సింగ్ ఎంతగానో సాయపడ్డారు. మోహితే రికార్డుకు సంబంధించిన పేపర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు పంపించామన్నారు మోహితే కోచ్ జ్వాలా సింగ్ .
ఇదీ చూడండి: షూటింగ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం