Mumbai Indians Coach : ముంబయి ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌లుగా ఉన్న మహేలా జయవర్ధనే, జహీర్ ఖాన్‌కు యాజమాన్యం కొత్త బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా జయవర్ధనేకు గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్ పదవిని అప్పగించింది. మరో కోచ్ జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్ చేసింది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఇందులో భాగంగా జయవర్ధనే.. ముంబయి ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20), ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) ఫ్రాంచైజీలకు వ్యూహాత్మక ప్లానింగ్, కోచింగ్ సంబంధిత వ్యవహారాల చూస్తాడు. అలాగే మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్‌మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ తదితర వ్యవహారాల పర్యవేక్షకుడిగా ఉంటాడు. జహీర్ ఖాన్ ఈ మూడు ఫ్రాంచైజీల్లో అడుతున్న క్రికెటర్ల డెవలప్మెంట్, ప్రోగ్రామ్ డెవెలప్మెంట్, కొత్త ట్యాలెంట్‌ను వెతకడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాడు.
శ్రీలంక దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్ధనే 2017 నుంచి ముంబయి ఇండియన్స్ జట్టుకు హెడ్ కోచ్ గా పని చేస్తున్నాడు. భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ 2019లో ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. అయితే వీరిద్దరికి కొత్త బాధ్యతలు అప్పగిండం వల్ల ఖాళీ అయిన కోచ్‌ల స్థానాలను త్వరలో భర్తీ చేస్తామని యాజమాన్యం వెల్లడించింది.
ఇవీ చదవండి: టీమ్ఇండియాతో సిరీస్.. ఆసీస్‌కు భారీ షాక్.. ముగ్గురు కీలక ప్లేయర్స్..
4 ఓవర్లలో 2 మెయిడెన్లు.. 3 పరుగులిచ్చి 4 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలే