ETV Bharat / sports

టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మకు సన్మానం - రోహిత్​ శర్మ వార్తలు

Rohit Sharma Felicitation: టీమ్​ఇండియాకు వరుస విజయాలను అందిస్తున్న కెప్టెన్​ రోహిత్​ శర్మను ముంబయి క్రికెట్​ అసోసియేషన్​ సన్మానించనుంది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్​గా ఉన్న నేపథ్యంలో ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రోహిత్​తో పాటు సూర్యకుమార్​ యాదవ్, శ్రేయస్​ అయ్యర్​లను కూడా ఎంసీఏ సన్మానించనుంది.

rohit sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Feb 25, 2022, 5:42 PM IST

Rohit Sharma Felicitation: ఇటీవల మూడు ఫార్మాట్లకు పూర్తిస్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న టీమ్​ఇండియా సారథి రోహిత్​ శర్మను ముంబయి క్రికెట్​ అసోసియేషన్​ సన్మానించనుంది. ప్రస్తుతం టీ20, వన్డేలకు కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్న రోహిత్.. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్​తో టెస్టు​ ఫార్మాట్​కు కూడా పూర్తిస్థాయిలో సారథ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో ఎంసీఏ, రోహిత్​ను సన్మానించాలని నిర్ణయించినట్లు కౌన్సిల్​ సభ్యుడు వెల్లడించారు.

వీరికి కూడా..

రోహిత్​తో పాటు మరికొందరు ఆటగాళ్లను కూడా ఎంసీఏ సన్మానించనుంది. ఇటీవల జరిగిన అండర్​-19 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా జట్టు తరపున మెరుగైన ప్రదర్శన చేసిన రఘువంశీకి మొమెంటో సహా రూ.లక్ష రివార్డు అందిస్తామని కౌన్సిల్​ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం టీమ్​ఇండియాలో తమ ప్రదర్శనతో అదరగొడుతున్న సూర్యకుమార్​ యాదవ్, శార్దుల్​ ఠాకుర్​, శ్రేయస్​ అయ్యర్​లను కూడా ఎంసీఏ సన్మానించనుంది. వీరితో పాటు యువక్రికెటర్లు సర్ఫరాజ్​ ఖాన్, పృధ్వీ షాలు కూడా ఈ సన్మానం అందుకోనున్నారు.

ఐపీఎల్​ ప్రారంభమయ్యేలోపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంసీఏ కౌన్సిల్​ సభ్యులు వెల్లడించారు.

ఇదీ చూడండి : Ishan kishan: ధోని, పంత్​లను దాటేసిన ఇషాన్​ కిషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.