MS Dhoni: ఎంఎస్ ధోనీ.. అంత గొప్ప నాయకుడిగా ఎలా ఎదిగాడో తన మొదటి సమావేశంలో తెలిసిందని 2016లో పుణెకు సహాయక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రసన్న అగోరమ్ వెల్లడించాడు. ధోనీ తనకు స్వాగతం పలుకుతూనే ఓ కీలక సూచన కూడా చేశాడని పేర్కొన్నాడు. "నాకు తొలిసారి మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి పనిచేసే అవకాశం 2016లో వచ్చింది. మొదటి రోజే 'మనిద్దరం కాసేపు మాట్లాడుకుందాం' అని ధోనీ చెప్పాడు. కాఫీ తాగుతారా? అని అడిగి తెప్పించాడు" అని ప్రసన్న గుర్తుచేసుకున్నాడు.
"మీకు చాలా అనుభవం ఉంది. అందుకే స్టీఫెన్ ఫ్లెమింగ్ మిమ్మల్ని తీసుకున్నాడు. మీతో పని చేయడం ఆనందంగా ఉంది. మీ వద్ద ఉన్న సమాచారం, స్ట్రాటజీకి సంబంధించిన వివరాలను కోచ్‌లతోపాటు ఆటగాళ్లకు ఇవ్వండి. స్ట్రాటజీ సమావేశాలకు ఆటగాళ్లు, కోచ్ వస్తారు. అయితే తాను (ధోనీ) వస్తానని మాత్రం ఆశించవద్దు. అంతేకాకుండా నేను అడిగేవరకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దు. అయితే ప్రతిదాన్నీ జీమెయిల్ రూపంలో కోచ్, ఆటగాళ్లతో కమ్యూనికేట్ అవ్వండి" అని ధోనీ చెప్పాడని ఆనాటి సంఘటనను ప్రసన్న గుర్తుకు తెచ్చుకున్నాడు.
ఇదీ చూడండి: 'తలా తిరిగొచ్చాడు'.. తొలి మ్యాచ్‌లో ధోనీ అరుదైన రికార్డు