MS Dhoni After Retirement Plans : క్రికెట్లో తనదైన శైలిలో ఆకట్టుకుంటూ కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు ఎంఎస్ ధోనీ. టీమ్ఇండియాకు టీ20, వన్డే వరల్డ్‌కప్‌తో ఛాంపియన్ ట్రోఫీ అందించారు. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లను సాధించిపెట్టారు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. ఇక 2024 ఐపీఎల్ సీజనే ధోనీకి చివరిదని అంతా భావిస్తున్నారు. అయితే ఈ తర్వాత ఆయన ఏమి చేస్తారనే ఆసక్తి మొదలైంది. ఈ విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
'ఇప్పటివరకు ఆ విషయం (ఐపీఎల్ రిటైర్మెంట్) గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఇంకా నేను క్రికెట్ ఆడుతున్నా. ఐపీఎల్లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. క్రికెట్ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే నాకూ ఆస్తికరంగానే ఉంది. అయితే, ఆర్మీలో మరింత సమయం గడపాలని ఉంది. గత కొన్నేళ్లుగా నేను ఎక్కువ సమయం వెచ్చిచలేదు. ఆ లోటును పూరించాల్సిన బాధ్యత నాపై ఉంది' అని ధోని సమాధానం ఇచ్చారు.
భారత్ క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ అందించిన సేవలకుగానూ 2011లో దేశ సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకు పొందారు. 2015లో ట్రైనింగ్ క్యాంప్‌లోనూ పాల్గొన్నారు. 2019లో జమ్మూ కశ్మీర్లో విధులు కూడా నిర్వహించారు. చిన్నప్పటి నుంచి తనకు సైనికుడు కావాలని ఉండేదని పలు సందర్భాల్లో ధోనీ వెల్లడించారు. 'ఆర్మీ సిబ్బందిని చూస్తున్నప్పుడల్లా నేను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరతానని చిన్నప్పుడే అనుకునేవాడిని' అని ధోనీ తెలిపారు.
-
After Cricket, i want to spend Bit More Time With the Army ❤️😇#MSDhoni pic.twitter.com/6J7EaySSop
— Chakri Dhoni (@ChakriDhoni17) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">After Cricket, i want to spend Bit More Time With the Army ❤️😇#MSDhoni pic.twitter.com/6J7EaySSop
— Chakri Dhoni (@ChakriDhoni17) December 21, 2023After Cricket, i want to spend Bit More Time With the Army ❤️😇#MSDhoni pic.twitter.com/6J7EaySSop
— Chakri Dhoni (@ChakriDhoni17) December 21, 2023
Dhoni Jersey No 7 : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో బీసీసీఐ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ధోనీ జెర్సీ నంబర్ 7ను రిటైర్ చేస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇకపై ఈ నెంబర్‌తో టీమ్ఇండియాలో మరో జెర్సీ ఉండదు. దీంతో మరే ఇతర భారత క్రికెటర్ ఈ నెంబర్ జెర్సీని వేసుకునే ఛాన్స్ లేదు. కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ జెర్సీ నెంబర్ 10ని బీసీసీఐ ఇప్పటికే రిటైర్ చేసింది.
ధోనీ పరువు నష్టం కేసు- IPS అధికారికి 15 రోజులు జైలు శిక్ష
ఫ్రెండ్ బర్త్‌డే వేడుకల్లో ధోనీ హంగామా - అలా చేయడం వల్ల ఫ్యాన్ సస్పెండ్!