ETV Bharat / sports

T20 worldcup: అన్ని లక్షల టికెట్లు అమ్ముడైపోయాయా?

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లను పెద్దసంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయని నిర్వాహకులు ప్రకటించారు.

t20 worldcup tickets
టీ20 ప్రపంచకప్​ టికెట్స్​
author img

By

Published : Oct 14, 2022, 12:32 PM IST

ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో.. ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్‌లను వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ పొట్టి ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. మిగతా దేశాలూ చేరుకుంటున్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో అక్కడ క్రికెట్‌ సందడి మొదలైంది. ఈ నెల 16 నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 సమరం మొదలవుతుంది.

ఈ మెగా టోర్నీకి 7 ఆస్ట్రేలియా నగరాలు వేదికలుగా ఉన్నాయి. సూపర్‌-12లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సిడ్నీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌.. గతేడాది ఫైనల్‌ పోరును తలపించేలా ఉండే అవకాశం ఉంది. ఈ ఆదివారం ప్రారంభ మ్యాచ్‌లతోపాటు సూపర్‌-12 మ్యాచ్‌ల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను చూసేందుకు తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ చీఫ్‌ మిచెల్‌ ఎన్‌రైట్‌ అన్నారు.

ఆ పోరుపైనే అందరి దృష్టి.. ఇక అందరి చూపు.. అక్టోబర్‌ 23న జరిగే దాయాదుల పోరుపైనే. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాక్‌ తలపడే ఈ పోరుకు 90 వేలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అడిషనల్‌ స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లు కూడా 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌ జరిగే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం.. అభిమానులకు అసలైన క్రికెట్‌ మజాను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదీ చూడండి: బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా.. క్రికెట్​లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.