IPL 2022 Mohit Sharma: ఒకప్పుడు ఐపీఎల్‌లో తన బౌలింగ్‌తో చుక్కలు చూపించిన స్టార్ బౌలర్ మోహిత్ శర్మ. ఐపీఎల్ 2014లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఒకప్పుడు స్టార్ బౌలర్‌గా చక్రం తిప్పిన మోహిత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు నెట్ బౌలర్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అతడితో పాటు టీమ్ఇండియా పేసర్ బరీందర్ స్రాన్ కూడా తీసుకున్నట్లు తెలిసింది.
Bowler Mohit Sharma: ఐపీఎల్-2022 మెగా వేలంలో మెహిత్ శర్మను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. అతడు చివరసారిగా ఐపీఎల్-2021 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. ఇక 2014 సీజన్‌లో 23 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు 86 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. 92 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున మోహిత్ శర్మ ఆడాడు.
ఈ నెల 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు తన తొలి మ్యాచ్‌లో మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో మార్చి 28న తలపడనుంది.
ఇదీ చదవండి: IPL 2022: ఐపీఎల్‌కు ఈ విదేశీ స్టార్స్ దూరం!