ipl 2022 rcb retention: వచ్చే ఐపీఎల్ సీజన్ రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా తనను ఎంపిక చేసుకున్నందుకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు మహ్మద్ సిరాజ్. రిటెన్షన్ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు నలుగురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండగా.. ఆర్సీబీ విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసుకుంది.
"నా మీద నమ్మకం ఉంచి రిటైన్ చేసుకున్నందుకు ఆర్సీబీకి ధన్యవాదాలు. నాకు నిజమైన గౌరవం దక్కింది. అభిమానులు ఆర్సీబీకి మద్దతును కొనసాగించండి. మమ్మల్ని ప్రేమిస్తూ ఉండండి" అని ఆర్సీబీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు సిరాజ్.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తనను రిటైన్ చేసుకున్నందుకు ఆర్బీబీకి కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఏడాది మరికొన్ని అడుగులు ముందుకేసి టైటిల్‌ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ రిటెన్షన్‌లో.. కోహ్లీని రూ.15 కోట్లకు ఆర్బీబీ రిటైన్ చేసుకోగా.. మ్యాక్స్‌వెల్‌కు రూ.11 కోట్లు, సిరాజ్‌కు రూ.7 కోట్లు వెచ్చించింది.
ఇదీ చదవండి: IPL 2022: మెగా వేలంలో ఈ స్టార్ క్రికెటర్లు ఎన్ని రూ.కోట్లు పలుకుతారో?