ETV Bharat / sports

భారత్​తో మ్యాచ్.. రిజ్వాన్​ చెప్పి మరీ కొట్టాడు!

author img

By

Published : Oct 25, 2021, 3:43 PM IST

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 news)​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్.. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్​కు ముందే రిజ్వాన్​ ఎలాంటి షాట్లు ఆడాలో ప్రాక్టీస్ చేశాడు. అదే షాట్లను మ్యాచ్​లోనూ ఆడి పాక్​కు గెలుపు అందించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

rizwan
రిజ్వాన్​

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 news)​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా(Ind vs pak t20) ఓడిపోయింది. బ్యాట్స్​మెన్ తడబడటం వల్ల ప్రత్యర్థి ముందు 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది కోహ్లీసేన. బ్యాటింగ్​కు దిగిన పాక్​.. ఒక్క వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్లు కెప్టెన్ బాబర్ అజామ్(babar azam stats), మహమ్మద్ రిజ్వాన్(mohammad rizwan record) అర్ధసెంచరీలతో మెరిశారు. కాగా ఈ మ్యాచ్​కు ముందు రిజ్వాన్​​ చేసిన ప్రాక్టీస్​ ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది.

ఏదైనా గొప్ప పోరులో గెలవాలంటే అంతకుమించిన కసి, పట్టుదల, ప్రణాళిక మనదగ్గర ఉండాలి. అదే చేసి చూపించాడు రిజ్వాన్(mohammad rizwan record). భారత్​తో మ్యాచ్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఏమో.. ముందే ఎలాంటి షాట్లను ఆడాలో ప్రాక్టీస్ చేశాడు. మ్యాచ్​ మొదలుకావడానికి ముందు వికెట్ల వెనకాల నిలబడి షాట్లు ఆడాడు. తర్వాత లక్ష్య ఛేదనలో బరిలో దిగి అదే షాట్లను మ్యాచ్​లోనూ ఆడాడు. ఈ వీడియోను ఐసీసీ నెట్టింట పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిజ్వాన్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఆడాడంటూ కితాబిస్తున్నారు.

ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​.. 20 ఓవర్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూర్తిగా స్వేచ్ఛగా ఆడారు పాకిస్థాన్​ ఆటగాళ్లు. ఆ తర్వాత లక్ష్యఛేదలో పాక్ బ్యాటర్లు దుమ్ముదులిపారు. భారత్​పై 10 వికెట్ల తేడాతో గెలిచారు. బాబర్ (68), రిజ్వాన్​ (79) నాటౌట్​గా నిలిచి జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించారు.

ఇవీ చూడండి: IND VS PAK: టీమ్​ఇండియా ఓటమి.. హర్భజన్​పై అక్తర్​ విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.