Mohammad Naim Fire Walking Video : ఆసియా కప్ మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్థాన్- నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కూడా ఆసియా కప్ కోసం సన్నద్దమవుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఢాకాలోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది.
-
Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 18, 2023Naim Sheikh working with a mind trainer ahead of Asia Cup. pic.twitter.com/mkykegJ06p
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 18, 2023
మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు..
Asia Cup 2023 Bangladesh Squad Players : ఈ క్రమంలో బంగ్లా జట్టు యువ ఆటగాడు మహ్మద్ నయీమ్ మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ట్రైనింగ్‌లో భాగంగా నయీమ్ నిప్పులపై నడిచాడు. సబిత్ రేహాన్ అనే ట్రైనర్ సాయంతో నయీమ్ ఈ ఫీట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఫైర్ వాకింగ్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నారు. తమ ధైర్యాన్ని పెంచుకోవడం సహా మానసికంగా దృఢంగా ఉండటానికి ఈ శిక్షణ ఉపయోగపడుందని నిపుణులు చెబుతున్నారు. కాగా సబిత్ రేహాన్.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో రంగపూర్ రైడర్స్ ఆటగాళ్లకు మైండ్ ట్రైనర్‌గా పనిచేశాడు. ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న శ్రీలంకతో తలపడనుంది.
మహ్మద్ నయీమ్ గణాంకాలు..
Mohammad Naim Stats : లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన మహ్మద్ నయీమ్ 35 టీ20 మ్యాచ్‌లు ఆడి 815 పరుగులు చేశాడు. అలాగే నాలుగు వన్డేల్లో 10 పరుగులు మాత్రమే సాధించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ ఆడి 24 పరుగులు చేశాడు. ఎక్కువగా మహ్మద్ నయీమ్ టీ20ల్లో ఆడుతుంటాడు.
ఆసియా కప్ షెడ్యూల్..
Asia Cup 2023 Schedule : ఆసియా కప్ ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబరు 17 వరకు జరగనుంది. ఆగస్టు 31న బంగ్లా జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. అలాగే సెప్టెంబరు 3న అఫ్గానిస్థాన్‌తో ఆడనుంది బంగ్లా జట్టు.
Asia Cup 2023 : ఆసియా కప్ టాప్-4 ఇంట్రెస్టింగ్ మ్యాచెస్.. వీటిని అస్సలు డోంట్ మిస్
బంగ్లా కెప్టెన్ యూటర్న్.. రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి.. ప్రధాని జోక్యంతో..