Kaif Yusuf Pathan: అప్పట్లో యూసఫ్ పఠాన్, మహ్మద్ కైఫ్ టీమ్ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆల్‌రౌండర్‌గా యూసఫ్, బ్యాటింగ్, అద్భుత ఫీల్టింగ్తో కైఫ్ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే వీరికి సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు తొందరగానే రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో వీరిద్దరూ ఇండియా మహారాజా జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
లెజెండ్స్ లీగ్‌లో భాగంగా ఆసియా ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజా తరఫున ఆడుతున్న యుసఫ్ పఠాన్.. చెలరేగి బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లోనే 80 పరుగులు బాదాడు. అనంతరం కైఫ్ (41*), ఇర్ఫాన్ పఠాన్ (21*) నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయం అనంతరం కైఫ్.. ట్విట్టర్లో ఓ ఫన్నీ పోస్ట్ షేర్ చేశాడు. "ఐపీఎల్ జట్లు మేము రెడీ. మెగావేలానికి ముందు ఓ సందేశం పంపండి. ఒకరిని తీసుకుంటే మరొకరు ఉచితం" అంటూ యూసఫ్‌తో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఇది కాస్తా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ మెసేజ్ మీరూ చూసేయండి.
-
IPL teams we are ready. DM before auction. Ek pe ek free wala option bhi hai ... 😊 @llct20 pic.twitter.com/FRyQdJCv9d
— Mohammad Kaif (@MohammadKaif) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">IPL teams we are ready. DM before auction. Ek pe ek free wala option bhi hai ... 😊 @llct20 pic.twitter.com/FRyQdJCv9d
— Mohammad Kaif (@MohammadKaif) January 21, 2022IPL teams we are ready. DM before auction. Ek pe ek free wala option bhi hai ... 😊 @llct20 pic.twitter.com/FRyQdJCv9d
— Mohammad Kaif (@MohammadKaif) January 21, 2022
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!