ETV Bharat / sports

ఐపీఎల్​ గురించి మిచెల్​ స్టార్క్ కామెంట్స్ - 'ఆ డెసిషన్​ నాదే - అందుకు నేనేం బాధపడను' - ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్​ స్టార్క్

Mitchell Starc IPL 2024 : ఇటీవలే జరిగిన ఐపీఎల్​ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్​ మిచెల్​ స్టార్క్​ను కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫ్రాంచైజీ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ విషయంపై మిచెల్ తాజాగా స్పందించాడు. అంతే కాకుండా ఇన్నేళ్లు తను ఐపీఎల్​లో ఆడకపోవడానికి గల కారణాన్ని వివరించాడు.

Mitchell Starc IPL 2024
Mitchell Starc IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 7:03 PM IST

Mitchell Starc IPL 2024 : రానున్న ఐపీఎల్​ సీజన్​ 17 కోసం గట్టి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవలే దుబాయ్‌ వేదికగా ఐపీఎల్​ మినీ వేలం గ్రాండ్​గా జరిగింది. దాదాపు 10 ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొని మినీ వేలంలో తమకు నచ్చిన ప్లేయర్లను ఎంచుకున్నాయి. అందులో భారత్​తో పాటు మిగిలిన దేశాలకు చెందిన క్రికెట్లరను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. అయితే అందులో కొంత మంది స్టార్స్​ను భారీ ధరకు కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు ప్లేయర్​ మిచెల్ స్టార్క్​ను రూ. 24.75 కోట్ల ధరకు కోల్​కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ విషయంపై నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఓ విదేశీ ప్లేయర్​ను ఇంత ధరకు ఎందుకు కొనుగోలు చేశారంటూ క్రికెట్ లవర్స్​ ఆరా తీస్తున్నారు. మిచెల్ స్టార్క్‌ గత ఏడు సీజన్‌లలో ఐపీఎల్‌ల్లో అసలు ఆడనే లేదు. దీంతో అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచుంటాయంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఐపీఎల్​లో ఇన్నేళ్లు ఎందుకు ఆడలేదన్న విషయం పైన స్టార్క్‌ తాజాగా స్పందించాడు.

"టెస్టు క్రికెట్‌కే నా మొదటి ప్రాధాన్యం. టెస్టులతో పాటు ఆస్ట్రేలియా తరఫున ఇంటర్నేషనల్​ లెవెల్​లో ఆడేందుకు నేను అధిక ప్రాధాన్యమిచ్చాను. ఇన్నాళ్లూ ఐపీఎల్​లో ఆడనందుకు నేనేమీ చింతించలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఐపీఎల్‌ నుంచి దూరంగా ఉండటం వల్ల టెస్టులలో నా ఆట కూడా మెరుగుపడింది. ఈ విషయం నేను గతంలో ఒక సారి చెప్పాను. రెడ్‌ బాల్‌ క్రికెట్​ నాకు ఎప్పుడూ ముఖ్యమే. రాబోయే ఏడాదిలో టీ20 వరల్డ్‌ కప్‌లో సిద్ధమయ్యేందుకు ఐపీఎల్‌ నాకు దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను" అంటూ స్టార్క్​ అసలు విషయం చెప్పుకొచ్చాడు. మరోవైపు వేలంలో తనపై ఫ్రాంచైజీలు మక్కువ చూపిన తీరుకు ఆనందంగా ఉందని అందుకు కృతజ్ఞుడనంటూ తెలిపాడు. రానున్న సీజన్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు.

ఐపీఎల్​లో టాప్ - 5 భారీ కొనుగోళ్లు

  • మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- రూ. 24.75 కోట్లు- కోల్​కతా నైట్​రైడర్​ (2024)
  • ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- రూ. 20.50 కోట్లు- సన్​రైజర్స్ హైదరాబాద్ (2024)
  • శామ్ కరన్ (ఇంగ్లాండ్) - రూ. 18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్ (2023)
  • కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా)- రూ. 17.50 కోట్లు- ముంబయి ఇండియన్స్ (2023)
  • బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) - రూ. 16.25 కోట్లు- చెన్నై సూపర్​కింగ్స్ (2023).

స్టార్క్​పై కాసుల వర్షం- ఐపీఎల్ రికార్డులన్నీ బద్దలు- రూ. 24.75 కోట్లకు KKR కైవసం

'స్టార్క్​కు రూ.25 కోట్లు వేస్ట్​!- కోహ్లీకి రూ.42కోట్లు పక్కా- ఓవర్సీస్‌ ప్లేయర్లు చాలా తెలివైనోళ్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.