ETV Bharat / sports

ఈ సీజన్​ మహిళల 'టీ20 ఛాలెంజ్​' అనుమానమే!

author img

By

Published : Apr 28, 2021, 12:39 PM IST

Updated : Apr 28, 2021, 1:03 PM IST

కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా ఈ సీజన్​ ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​ రద్దు కావచ్చని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

Women's T20 Challenge
మహిళల టీ20 ఛాలెంజ్

కరోనా సంక్షోభం కారణంగా ఈ సీజన్​ మహిళల టీ20 ఛాలెంజ్​ నిర్వహించడం కష్టమేనని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. రద్దు చేసే యోచనలో బోర్డు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

"దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం. సెకండ్​ వేవ్​ కారణంగా ప్రయాణ ఆంక్షలు, విమాన సర్వీసులు రద్దు వల్ల విదేశీ ఆటగాళ్లు ఇందులో పాల్గొనడం కష్టం అవుతుంది. ప్రతిఒక్కరి సురక్షితమే ప్రథమ బాధ్యత. కాబట్టి ఈ సారి టోర్నీని రద్దు చేసి.. వచ్చే సీజన్​లో నిర్వహించవచ్చు" అని అన్నారు.

తొలుత ఈ ఏడాది ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్ నాలుగు జట్లతో నిర్వహించాలని భావించారు. కానీ కరోనా కారణంగా ఎప్పటిలాగే మూడు టీమ్​లతో ఈ సీజన్​ టోర్నీ కొనసాగించనున్నట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవల వెల్లడించింది. కానీ వైరస్ వ్యాప్తి​ మరింత ఉద్ధృతమైన నేపథ్యంలో టోర్నీనే రద్దు చేసే యోచనలో ఉంది.

Last Updated : Apr 28, 2021, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.