Devara Janhvi kapoor Boyfriend Praises : యంగ్ టైగర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ కలిసి నటించిన చిత్రం దేవర బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజే రూ.170 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే తాజాగా ఈ చిత్రంపై జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాను వీక్షించిన అతడు జాన్వీ యాక్టింగ్‌కు ఫిదా అయినట్లు తెలిపాడు. ఆమె స్క్రీన్ ప్రజెన్స్‌కు మైమరిచిపోయినట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ దేవరలోని జాన్వీ కపూర్ ఫొటోను షేర్ చేశాడు.
'నేనేమైనా కలలో ఉన్నానా?' అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో మీ రిలేషన్ గురించి త్వరగా బయటకు చెప్పేయండి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా. ఇతనితోనే జాన్వీ డేటింగ్‌లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కలిసి బాలీవుడ్లో జరిగే పార్టీలకు, తిరుమలకు కలిసి వెళ్లడం వంటి చేస్తుంటారు. దీంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ ప్రచారం జోరందుకుంది.
'మైదాన్' ప్రమోషన్స్‌లోనూ పహరియా నిక్‌నేమ్‌తో కూడిన నెక్లెస్‌ను జాన్వీ ధరించడం కూడా బాగా చర్చనీయాంశమైంది. కాఫీ విత్ కరణ్ షోలనూ 'మీ స్పీడ్ డయిల్ లిస్ట్‌లో ఎవరి నంబర్లు ఉంటాయి?' అని అడగగా తన తండ్రి, చెల్లి, శిఖర్ పేరు చెప్పింది జాన్వీ. దీంతో జాన్వీ - శిఖర్ మధ్య మంచి రిలేషన్ ఉందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేవర సినిమా విషయానికొస్తే ఎన్టీఆర్ హీరోగా ఇది తెరకెక్కింది. ఇందులో తారక్ డ్యెయల్ రోల్ చేశారు. కొరటాల శివ తెరకెక్కించారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇందులో ఆమె తంగం పాత్రలో సందడి చేసింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లు అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు అందుకున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది మూవీటీమ్.
'సత్యం సుందరం' రివ్యూ - మనసును హత్తుకునేలా ఫీల్ గుడ్ స్టోరీ! - Satyam Sundaram Movie Review
బెస్ట్ యాక్టర్‌గా నాని - చిరంజీవి, బాలయ్యకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు - IIFA Utsavam 2024