ETV Bharat / sports

Black Lives matter: ఆ జట్టు ఉద్దేశం వేరేలా ఉంది - ఆల్ లైవ్ మ్యాటర్స్

'బ్లాక్ లైవ్స్​ మ్యాటర్​' ఉద్యమ విషయంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు సరైన ఉద్దేశంతో లేరని అభిప్రాయపడ్డారు విండీస్ మాజీ క్రికెటర్​ మైఖేల్ హోల్డింగ్. ఈ విషయంలో ఇంగ్లాండ్ ఫుట్​బాల్​ ఆటగాళ్లు ఒక్క తాటిపై ఉన్నారని స్పష్టం చేశారు. గతేడాది అమెరికాలో జార్జ్​ ఫ్లాయిడ్​ మృతి ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా 'బ్లాక్​ లైవ్స్​ మ్యాటర్'​ అనే ఉద్యమం ఊపందుకుంది.

michael holding, black lives matter
మైఖేల్ హోల్డింగ్, బ్లాక్ లైవ్స్ మ్యాటర్
author img

By

Published : Jun 12, 2021, 6:23 PM IST

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు 'ఆటగాళ్ల ఐకమత్యం' కోసం కట్టుబడి ఉంటామని చెప్పే ఉద్దేశంలో సరైన మద్దతు లేదని వెస్టిండీస్ దిగ్గజం మైఖేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. అది 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌' ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు లేదని, 'ఆల్ లైవ్స్‌ మ్యాటర్' అని మరో అర్థం వచ్చేలా ఉందని విమర్శలు చేశారు. గతేడాది అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అనే ఉద్యమం ఊపందుకుంది.

ఈ క్రమంలోనే క్రికెట్‌లోనూ ఆటగాళ్ల మధ్య జాతి వివక్షకు తావు లేదని ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ ఆటగాళ్లు అప్పట్లో ప్రమాణం చేశారు. అప్పుడు జాతి విద్వేషం, మతపరమైన అంశాలు, లైంగిక సంబంధిత వాటికి దూరంగా ఉంటామని పేర్కొన్న జెర్సీలను ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ధరించారు. అయితే, ఇటీవల పలువురు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు విద్వేష పూరిత ట్వీట్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మళ్లీ ఆ అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన హోల్డింగ్‌.. "ఆటగాళ్ల ఐకమత్యం కోసం ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఇప్పుడు చేస్తున్న ప్రతిజ్ఞ 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌'కు అనుకూలంగా లేదు. వాళ్లు చేసేది ఎలా ఉందంటే.. నేను 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అని చెప్తుంటే నువ్వు 'ఆల్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అనేలా ఉంది" అని విండీస్​ దిగ్గజం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: PSL 2021: రస్సెల్​ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు

ఈ విషయంలో ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లను మెచ్చుకోవచ్చని హోల్డింగ్‌ ప్రశంసించారు. ఇటీవల యూరో ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు, మేనేజర్‌ గారెత్‌ సౌత్‌గేట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే ముందు మోకాళ్లపై నిల్చొని మద్దతు తెలిపారన్నారు. ఇందుకు కొంత మంది అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా వారు ఆటగాళ్ల ఐకమత్యానికి కట్టుబడి ఉన్నారన్నారు. అలాగే తానూ 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమానికి కట్టుబడి ఉంటానని వెస్టిండీస్‌ మాజీ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: WTC Final: బౌల్ట్ బౌలింగ్​లో రోహిత్ ఎలా ఆడతాడో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.