MCA Pride Of The Place: భారత్- న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఆ తర్వాత తన బంతిని ఎంసీఏ మ్యూజియంకు ఇవ్వడాన్ని ప్రశంసించారు ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్ పాటిల్. త్వరలో ఈ బంతిని 'ప్రైడ్ ఆఫ్ ఆనర్' కింద భద్రపరుస్తామని అన్నారు. ఎంసీఏ మ్యూజియం.. భావితరాలకు స్ఫూర్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
"వాంఖడే స్టేడియంలో అజాజ్ పటేల్ సాధించిన విజయం ఎవరూ ఊహించలేనిది. మన స్టేడియం అజాజ్ సాధించిన ఈ విజయం ఓ జ్ఞాపకంలా మిగులుతుంది. ఆట తర్వాత 10 వికెట్లు తీసిన బంతిని ఇచ్చాడు. దానిని ఎంసీఏ మ్యూజియంలో 'ప్రైడ్ ఆఫ్ ఆనర్' కింద భద్రపరుస్తాం" అని పాటిల్ తెలిపారు.
MCA Historical Legacy: ముంబయి క్రికెట్‌కు ఎంతో ఘన చరిత్ర ఉందని, ముంబయి ఆటగాళ్లు సాధించిన విజయాలు మరవలేనివని అన్నారు పాటిల్. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో మహేంద్రసింగ్ ధోనీ సిక్సర్ కొట్టాడని.. అప్పడు బంతి పడిన కుర్చీని కూడా భద్రపరుస్తామని చెప్పారు. ఇలాంటి జ్ఞాపకాలు ఎంతో ప్రత్యేకమైనవని తెలిపారు. ముంబయి క్రికెట్లో జరిగిన ఎన్నో చారిత్రక సంఘటనలను ఒకే చోట పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
2022 అండర్-17 ఫిఫా వరల్డ్‌కప్‌నకు ముంబయి ఆతిథ్యమిస్తోందని వెల్లడించారు పాటిల్. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6వరకు ఈ టోర్నీ ముంబయి,నేవీ ముంబయి, పుణెలో జరగనుంది.
Ajaz 10 Wickets: భారత్- న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా అజాజ్ నిలిచాడు. అంతకుముందు జిమ్ లేకర్(1956), అనిల్ కుంబ్లే(1999) ఈ ఘనత సాధించారు.
ఇదీ చూడండి: 'పేసర్ అవ్వాలనుకున్నా.. కానీ స్పిన్నర్ అయ్యా'