Manoj Tiwary Retirement : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం బంగాల్ ప్రభుత్వంలో స్పోర్ట్స్ మినిస్టర్‌గా ఉన్న మనోజ్ తివారీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన నోట్ రాశాడు. తివారీ చివరిసారిగా 2015లో భారత్ తరపున ఆడాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కూడా అతడు దేశవాళీ క్రికెట్ ఆడటం విశేషం.
క్రికెట్‌కు రుణపడి ఉంటా
Manoj Tiwary Retirement Note : తాజాగా గురువారం (ఆగస్టు 3) తన రిటైర్మెంట్ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేస్తూ ఓ పెద్ద మెసేజ్‌ను తివారీ రాశాడు. "క్రికెట్ కు గుడ్ బై. ఈ ఆట నాకు అన్నీ ఇచ్చింది. నేను కలలో కూడా ఊహించనివి కూడా క్రికెట్ నాకు ఇచ్చింది. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొంటున్న సమయం నుంచీ క్రికెట్ నాకు అండగా నిలిచింది. క్రికెట్‌కు, ఆ దేవుడికి ఎప్పుడూ రుణపడి ఉంటాను" అంటూ రాసుకొచ్చాడు.
2008లో తొలిసారి..
Manoj Tiwary Career : మనోజ్ తివారీ.. టీమ్ఇండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2008లో తొలిసారి బ్లూ జెర్సీలో కనిపించిన అతడు.. 2015 వరకు మధ్య మధ్యలో టీమ్‌లోకి వచ్చివెళ్తూ ఉన్నాడు. వన్డేల్లో ఒక సెంచరీ కూడా చేశాడు. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన తివారీ.. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. తర్వాత మమతా బెనర్జీ అతడిని మంత్రి వర్గంలోకి తీసుకొని క్రీడా మంత్రిత్వ శాఖ అప్పగించారు.
రంజీ ట్రోఫీలో..
బంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్లో మనోజ్ తివారీకి మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో దిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ పంజాబ్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ లాంటి టీమ్స్ తరఫున ఆడాడు. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో తొలిసారి మనోజ్ తివారీ టీమ్ఇండియా తరఫున ఆడాడు. 2011లో యువరాజ్ స్థానంలో వెస్టిండీస్ టూర్‌కు ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌తో ఐదో వన్డేలో సెంచరీ చేసినా కూడా తర్వాత 14 మ్యాచ్‌ల పాటు అతడు జట్టుకు దూరంగానే ఉన్నాడు. టీ20 కెరీర్ కూడా అలాగే సాగింది. అయితే డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం తివారీ గొప్ప ప్లేయర్‌గా నిలిచాడు. బంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ అతడే.