ETV Bharat / sports

'ఆరు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలి'

మహిళల ఐపీఎల్​ ఆరు​ జట్లతో నిర్వహించాలని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన కోరింది. ఓ యూట్యూబ్​ ఛానల్​లో మాట్లాడిన ఆమె మరిన్ని ఆసక్తికరమైన అంశాలపై చర్చించింది.

smriti mandhana, cricketer
స్మృతి మంధాన, క్రికెటర్
author img

By

Published : Aug 18, 2021, 9:06 PM IST

ఆరు టీమ్​లతో మహిళల ఐపీఎల్​ నిర్వహించాలని టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అభిప్రాయపడింది. ఇలా చేస్తే భారత జట్టు బెంచ్ స్ట్రెంత్​ను మరింత దృఢంగా చేయొచ్చని తెలిపింది.

టీ20 లీగ్స్​ను ప్రారంభించాక పురుష జట్టులో క్రికెటర్ల ఆటతీరు మెరుగైందని తెలిపిన మంధాన.. మహిళల జట్టులోను అదే జరుగుతుందని పేర్కొంది. రవిచంద్రన్ అశ్విన్​ యూట్యూబ్ ఛానల్​లో మాట్లాడిన ఆమె 10 ఏళ్ల క్రితం ఐపీఎల్​ భిన్నంగా ఉండేదని తెలిపింది. మహిళా క్రికెటర్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు ఈ లీగ్​ వేదికగా మారాలని ఆశించింది.

బిగ్​ బాష్ లీగ్​ వల్ల ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆటతీరు మారిందని చెప్పుకొచ్చింది మంధాన. ఈ లీగ్​ నిర్వహణతో 40-50 మంది ప్లేయర్లను అంతర్జాతీయ క్రికెట్​లో ఆడించేందుకు ఆసీస్ సిద్ధం చేసిందని చెప్పింది. ఈ తరహాలోనే బీసీసీఐ.. మహిళా ఐపీఎల్​ నిర్వహించాలని కోరింది.

ప్రస్తుతం బీసీసీఐ మహిళల కోసం మూడు జట్లతో టీ20ని నిర్వహిస్తోంది. ట్రయల్​బ్లేజర్స్, సూపర్​నొవాస్, వెలాసిటీ జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి. కానీ మూడుకు బదులు ఆరు జట్లతో లీగ్​ నిర్వహిస్తే మహిళా జట్లు కూడా మరింత బలంగా తయారవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

స్మృతి - ఇషాన్​.. ఈ డాషింగ్​ లెఫ్ట్​ హ్యాండర్ల స్టైలే వేరు!​

స్మృతి మంధాన.. ఆటలోనే కాదు అందంలోనూ మేటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.