ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​ నిబంధనల్లో కీలక మార్పులు! - ఐపీఎల్​ 2022 రూల్స్​

Major rule Changes in Ipl 2022: మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్​ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్​ నిబంధనల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశముందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

Major rule Changes in Ipl 2022:
Major rule Changes in Ipl 2022:
author img

By

Published : Mar 15, 2022, 11:00 AM IST

Updated : Mar 15, 2022, 11:15 AM IST

Major rule Changes in Ipl 2022: శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను అద్భుత విజయం సాధించి టీమ్‌ఇండియా జోరు మీదుంది. బ్యాటుతో, బంతితో అదరగొట్టిన రోహిత్‌ సేన.. జూన్‌, జులైలోనే తన తర్వాతి మ్యాచ్‌లు ఆడనుంది. ఆలోపు ఆటగాళ్లంతా వేసవిలో అభిమానులకు పసందైన వినోదం అందించేందుకు ఐపీఎల్‌-15వ సీజన్‌ ఆడనున్నారు. అయితే అయితే, ఈసారి సీజన్​ నిబంధనల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ ఓ నిర్ణయానికి కూడా వచ్చేసిందని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే అధికార ప్రకటన కూడా ఇవ్వనుందని పేర్కొన్నారు.

  • ఏదైనా జట్టు మ్యాచ్‌కు ముందు కరోనా బారినపడితే.. ఆరోజు మ్యాచ్‌లో దిగేందుకు 11 మంది సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయాలనేదానిపైనే కచ్చితమైన ప్రణాళిక రూపొందించారని తెలిసింది. కాగా, ఇదివరకు అలాంటి పరిస్థితుల్లో ఆరోజు జరగాల్సిన మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసేవారు. ఇప్పుడు కూడా అలా రీషెడ్యూల్ చేసేందుకే చూస్తారు. ఒకవేళ అది కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఐపీఎల్‌ టెక్నికల్‌ టీమ్‌ దృష్టికి తీసుకెళ్తారు. వాళ్లు తీసుకునే నిర్ణయమే అంతిమం.
  • ఇక రెండో మార్పు.. ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు రెండు రివ్యూలు కోరే అవకాశం. ఇంతకుముందు ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో సమీక్ష కోరే వెసులుబాటు మాత్రమే ఉండేది. దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. దీంతో ఒక్కో జట్టు ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండేసి రివ్యూలు ఉపయోగించుకోవచ్చు.
  • మరోవైపు ఇటీవల మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధన.. ఎవరైనా బ్యాట్స్‌మన్‌ క్యాచ్‌ ఔటైన సందర్భాల్లో.. క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్‌ చేయాలనే కొత్త నిర్ణయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దాన్ని ఈ సీజన్‌లోనే అమలు చేయాలనుకుంటున్నారు.
  • ఇక ప్లేఆఫ్స్‌ లేదా ఫైనల్‌ లాంటి కీలక మ్యాచ్‌ల్లో ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్‌ ఓవర్‌ నిర్వహిస్తారు. అది కూడా కుదరని పక్షంలో లీగ్‌ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టునే విజేతగా ప్రకటిస్తారని ఆ అధికారి చెప్పారు.

అయితే ఈ కొత్త నిబంధనలపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

Last Updated : Mar 15, 2022, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.