Legends League Cricket: ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు పాల్గొనబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 20 నుంచి ఈ టోర్నీ ఒమన్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే జట్ల కెప్టెన్ల పేర్లను ప్రకటించారు.
భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించే మహారాజ టీమ్‌కు సారథిగా వీరేంద్ర సెహ్వాగ్ వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా మహ్మద్ కైఫ్ నియమితుడయ్యాడు. కోచ్‌గా ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ జాన్ బుచనన్ను ఎంపిక చేశారు.
టోర్నీలో ఆడబోయే మరో రెండు జట్లు.. ఆసియా లయన్స్‌కు సారథిగా మిషబ్ ఉల్ హక్, వైస్ కెప్టెన్‌గా తిలకరత్నె దిల్షాన్, కోచ్‌గా అర్జున(arjuna ranatunga).. వరల్డ్ జెయింట్స్‌కు సారథిగా డారెన్ సామీ, జాంటీ రోడ్స్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు.
ఈ లీగ్‌లో భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రినాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ, హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ భండారి ఆడనున్నారని ఇటీవలే లీగ్ కమిషనర్ రవిశాస్త్రి వెల్లడించారు.
ఇదీ చూడండి:
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో సెహ్వాగ్, యూవీ, భజ్జీ.. భారత జట్టిదే