ETV Bharat / sports

కోహ్లీకి లిప్​లాక్​ ఇచ్చిన లేడీ ఫ్యాన్​​.. వీడియో వైరల్​ - విరాట్​ కోహ్లికి లేడీ ఫ్యాన్​ లిప్​కిస్​

భారత యువ ఆటగాడు విరాట్​ కోహ్లీకి ఓ లేడీ ఫ్యాన్ లిప్​ కిస్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Lady Fan Lip Kiss To Virat Kohli
విరాట్​ కోహ్లికి లేడీ ఫ్యాన్​ లిప్​కిస్​
author img

By

Published : Feb 21, 2023, 7:24 PM IST

Updated : Feb 21, 2023, 9:09 PM IST

టీమ్​ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు భారత్​తో పాటు విదేశాల్లోనూ ఈయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కేవలం ఇన్​స్టాగ్రాంలోనే 237 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఈయనకున్న క్రేజ్​ను​ అర్థం చేసుకోవచ్చు. విరాట్​ ఆటతీరుకే కాదు ఆయన బాడీ ఫిట్​నెస్​కు, హెయిర్​స్టైల్​కు, డ్రెస్సింగ్​, యాటిట్యూడ్​కు కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్​ ఉంటారు. వయస్సు, జెండర్​తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ రన్​మెషీన్​ను ఒక్కసారైనా కలవాలి, చూడాలి, అవకాశం వస్తే ఓ సెల్ఫీ దిగేదాకా కూడా ఊరుకోరు. ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళా ఫ్యాన్​ కోహ్లిపై తనకున్న ప్రేమను వినూత్నంగా ప్రదర్శించింది. ఏకంగా ఈ కింగ్​​ మైనపు బొమ్మ పెదాలపై ముద్దు పెట్టేసింది. ప్రస్తుతం ఈ లిప్​లాక్​ వీడియో నెట్టింట ట్రెండ్​ అవుతోంది.

ఈ వీడియోలో కోహ్లీ బొమ్మకు ముద్దు పెడుతూ, ఆ అమ్మాయి ప్రదర్శించిన ఎక్స్​ప్రెషెన్స్ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో.. ఈ సీన్​ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు జనాలు తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే దిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ వీడీయోను ఓ యువతి తీసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ కోహ్లీ మైనపు బొమ్మను 2018 జూన్‌లో ఏర్పాటు చేశారు.

అయితే ప్రస్తుతం కోహ్లీ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ- 2023 ఆటలో బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయిన విరాట్​.. తొలి టెస్టులో 12, రెండో టెస్టులో 44, 20 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్​ కలిపి 76 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్‌ల్లో శతకాలు బాదిన కోహ్లీ టెస్టుల్లో మాత్రం పేలవ ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. అతడు.. 2019 నవంబర్‌ 22న చివరిసారి టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడో టెస్టులోనైనా కోహ్లీ శతకం బాదాలని క్రికెట్​ లవర్స్​ ఆశపడుతున్నారు.

Last Updated : Feb 21, 2023, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.