ETV Bharat / sports

'కుల్దీప్​.. ధోనీ లేడు మరో దారి వెతుక్కో'

శ్రీలంక సిరీస్​లో కుల్దీప్​​ యాదవ్(Kuldeep yadav)​ బాగా రాణిస్తే.. ఐపీఎల్​, టీ20 ప్రపంచకప్​లో మెరుగైన అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్​ వెంకటపతి రాజు. దాంతో అతడు మ్యాచ్​ విజేతగా మారే అవకాశాలు ఉన్నాయని అన్నాడు.

kuldeep
కుల్దీప్​
author img

By

Published : Jul 17, 2021, 7:21 AM IST

వికెట్లు తీసేందుకు కుల్దీప్​ యాదవ్‌ (Kuldeep yadav) ఏదో ఒక దారి వెతకాలని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ వెంకటపతి రాజు అన్నాడు. అతడికి సలహాలిచ్చేందుకు ఇప్పుడు ధోనీ లేడని గుర్తు చేశాడు. శ్రీలంక సిరీస్‌ అతడికి మంచి అవకాశమని తెలిపారు. ఇక్కడ రాణిస్తే ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన అవకాశాలు ఉంటాయని వెల్లడించాడు.

"శ్రీలంక పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయి. కుల్‌దీప్‌ పునరాగమనానికి ఇవి అనువైనవి. ఐపీఎల్‌, టీ20 ప్రపంచకప్‌ జరిగే యూఏఈలోనూ పిచ్‌లు ఇలాగే ఉంటాయి. దాంతో కుల్దీప్​ మ్యాచ్‌ విజేతగా మారే అవకాశాలూ ఉన్నాయి. అతడి కెరీర్​రో సారథుల పాత్రే కీలకంగా మారింది. ధోనీ నేతృత్వంలో బాగా రాణించానని అంటుంటాడు. కానీ ఇప్పుడతను లేడు. కాబట్టి ఏదో ఒక దారి వెతకాలి. అతడు యువకుడు. తెలివైన బౌలర్‌. అంతర్జాతీయ అనుభవం ఉంది. వికెట్లు తీయడంపై ఏకాగ్రత పెడితే మంచిది. పరిమిత అవకాశాలే దొరుకుతాయని అతడు దృష్టిలో పెట్టుకొని ఆడాలి. ఒత్తిడి చెందొద్దు. వైవిధ్యం ప్రదర్శించాలి. క్రికెట్‌ సులభం కాదని అతడికి తెలుసు. కఠోరంగా శ్రమించాలి. కుల్దీప్​కు ఓ మంచి అలవాటుంది. ఒక వికెట్‌ పడగొట్టాడంటే చాలు మ్యాచులో రెండు లేదా మూడు వికెట్లు తీస్తుంటాడు" అని రాజు తెలిపాడు.

శ్రీలంక-టీమ్​ఇండియా (Srilanka-TeamIndia series) జులై 18 నుంచి జులై 29 వరకు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి.

ఇదీ చూడండి: Kuldeep: 'ఆ సిరీస్​లోనైనా​ అవకాశం వస్తుందని..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.