ETV Bharat / sports

'ధైర్యం లేని వారే ట్రోల్స్​ చేస్తారు' - boult on india team

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) పాకిస్థాన్​తో మ్యాచ్​ అనంతరం టీమ్​ఇండియా బౌలర్ షమిపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News). మతం పేరుతో ఓ ఆటగాడిని ట్రోల్స్ చేయడం బాధాకరమని అన్నాడు. ఆదివారం(అక్టోబర్ 31) న్యూజిలాండ్​తో(IND vs NZ T20) జరగనున్న మ్యాచ్​పైనా మాట్లాడాడు.

virat kohli
విరాట్ కోహ్లీ
author img

By

Published : Oct 30, 2021, 9:13 PM IST

టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2021) తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మీద భారత్‌ ఓడిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఓటమికి కారణమంటూ మహమ్మద్‌ షమీపై(Trolls on Shami) నెటిజన్లు అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే టీమ్‌ఇండియా సహా మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు షమీకి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli News) మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. వినోదం కోసం సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసే వ్యక్తులకు ధైర్యం ఉండదని, మనిషి సామర్థ్యం అత్యల్ప స్థాయికి పడిపోయినప్పుడే ఇలాంటి ట్రోల్స్‌ చేస్తుంటారని విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. టీమ్‌ఇండియా ఓటమికి మహమ్మద్‌ షమీని బాధ్యుడిని చేస్తూ ట్రోల్స్‌ చేయడాన్ని ఖండించాడు. క్రికెటర్లు, క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌ వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టడం నెటిజన్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిందని.. ఇది విచారకరమైన పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొన్నాడు.

mohammad shami
మహ్మద్ షమి

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో కీలక పోరులో టీమ్‌ఇండియా(IND vs NZ T20) తలపడనుంది. ఈ క్రమంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ షమీపై సోషల్‌ మీడియా ట్రోల్స్‌ను తీవ్రంగా ఖండించాడు.

"మేం మైదానంలో ఆడటానికి మంచి కారణం ఉంది. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ధైర్యంలేని వ్యక్తులు మాత్రమే ట్రోల్స్‌ చేస్తున్నారు. వారికి ఎవరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడే ధైర్యం ఉండదు. వారు తమ గుర్తింపును దాచుకుని మరీ సోషల్‌ మీడియా ద్వారా దాడి చేస్తుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం క్రీడాకారులు, క్రికెటర్లపై ట్రోల్స్‌ చేయడం సరదా అయిపోయింది. ఈ డ్రామా అంతా ఫ్రస్ట్రేషన్‌ నుంచి వచ్చింది. ఆత్మవిశ్వాసం లోపించడం, దయాగుణం లేకపోవడంపై ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే ఇతరులను ట్రోల్స్‌ చేయడం వినోదంగా భావిస్తారు. ఇలాంటప్పుడే మేమంతా ఒక బృందం మాదిరిగా ఎలా కలిసి ఉండాలో అర్థం చేసుకున్నాం. ఒకరికొకరం అండగా నిలుస్తాం. మైదానంలో ఎలా మా బలాలను వినియోగించాలో దానిపైనే దృష్టి పెడతాం"

--విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి.

ఇక కివీస్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. టీమ్‌ఇండియా బ్యాటర్లు న్యూజిలాండ్‌ పేస్‌ దాడిని సమర్థంగా ఎదుర్కొంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. పాక్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది మాదిరిగా తమను ఇబ్బందిపెట్టాలని చూస్తే మాత్రం ట్రెంట్‌బౌల్ట్‌కు(Boult News) సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశాడు.

బౌల్ట్​కు కౌంటర్​ ఇవ్వాలి..

ఆదివారం(అక్టోబర్ 31) న్యూజిలాండ్​తో జరగనున్న మ్యాచ్​ నేపథ్యంలో టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్​ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు సిద్ధంగా ఉండాలని తెలిపాడు. పాక్​ బౌలర్ షహీన్​లా టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్​ను కట్టడి చేయాలని బౌల్డ్ యోచిస్తే.. భారత బ్యాటర్లు దీటుగా సమాధానం ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెరుగైన బౌలర్ల బృందంతోనే బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:

భారత్​ X న్యూజిలాండ్: గెలిచిన జట్టుకే సెమీస్​ ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.