ETV Bharat / sports

తొలి టెస్టు గెలుపు క్రెడిట్​ వారిదే: కోహ్లీ

Kohli reaction on Centurion Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్​ఇండియా ​విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్​ కోహ్లీ. మ్యాచ్​ విజయంలో కీలకంగా వ్యవహరించిన​ కేఎల్​ రాహుల్​, మయాంక్​, షమీపై ప్రశంసలు కురిపించాడు.

author img

By

Published : Dec 30, 2021, 6:47 PM IST

Updated : Dec 30, 2021, 7:24 PM IST

kohli
కోహ్లీ

Kohli reaction on Centurion Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ క్రెడిట్​..​ సెంచరీ, అర్ధశతకంతో చెలరేగిన కేఎల్​ రాహుల్​, మయాంక్​ అగర్వాల్​కు దక్కుతుందని అన్నాడు కెప్టెన్​ కోహ్లీ. బౌలర్లలో షమీ అద్భుతంగా బౌలింగ్​ చేశాడని కొనియాడాడు. మొత్తంగా జట్టు సమిష్టిగా రాణించిందని పేర్కొన్నాడు.

"ఈ పర్యటనలో మాకు శుభారంభం దక్కింది. వర్షం కారణంగా ఒక రోజు ఆట (రెండో రోజు) పూర్తిగా తుడిచిపొట్టుకుపోయినా మేము చాలా బాగా ఆడాం. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడటం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. విదేశాల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం సవాలుతో కూడుకున్నది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించడానికి మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కారణం. బౌలర్లు రాణిస్తారని మాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో మా బౌలర్లు సమష్టిగా బౌలింగ్ చేయడంతో జట్టు ఈ ఫలితాన్ని పొందింది. షమి కచ్చితంగా అద్భుతమైన, ప్రపంచస్థాయి బౌలర్‌. ప్రస్తుతం ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ పేసర్లలో అతడు ఒకడు" అని విరాట్‌ పేర్కొన్నారు.

రెండు జట్ల మధ్య తేడా అదే

"తొలి టెస్ట్‌ ఓడిపోవడం బాధాకరం. మేం కొన్ని తప్పులు చేశాం. అయితే, కొన్ని సానుకూలతలు కూడా బయటికి వచ్చాయి. రాబోయే రెండు టెస్టుల్లో మేం వాటిని ఉపయోగించుకోవాలి. భారత ఓపెనర్లు రాణించారు. తొలుత మా బౌలర్లు సరైన లెంగ్త్‌లో బంతులు వేయలేదు. కొన్నిసార్లు చర్చించిన తర్వాత బౌలింగ్‌లో మార్పు కనిపించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాను తక్కువ స్కోరుకే పరిమితం చేశాం. 20 వికెట్లు తీయడానికి మా బౌలర్లు పడిన కష్టాన్ని చెప్పలేం. మా బ్యాటర్లు నిరాశపరిచారు. రెండు జట్ల మధ్య బ్యాటింగ్‌లో తేడా ఉంది. ఈ విషయంపై జట్టు యాజమాన్యంతో చర్చించాలి" అని ఎల్గర్‌ తమ జట్టు ఆటతీరు గురించి వివరించాడు.

ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది

"ఛాలెంజింగ్‌ పిచ్‌పై ఓపెనింగ్‌ భాగస్వామ్యం కీలకం. నా ఆటతీరు పట్ల నిజంగా సంతోషంగా ఉంది. నా ఆటలో చాలా సాంకేతిక మార్పులు చేశానని అనుకోవద్దు. ఇది నా మనస్తత్వం, ప్రశాంతత, క్రమశిక్షణలో వచ్చిన మార్పు. విదేశాల్లో మంచి ప్రదర్శన కనబరిచేందుకు క్రమశిక్షణతో నడుచుకోవడం ఎంతో ఉపయోగపడింది. విదేశాల్లో సెంచరీలు చేయడం పట్ల గర్వంగా ఉన్నా. మన ఫాస్ట్ బౌలింగ్‌ బృందం ఈరోజు మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా రాణిస్తోంది. షమీతోపాటు ఇతర బౌలర్లు మంచి ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సౌతాఫ్రికాకి రావడం చాలా ప్రత్యేకమైనది. ఈ విజయం మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. తర్వాతి టెస్టులో కూడా గెలవాలని కోరుకుంటున్నాను." అని కేఎల్​ రాహుల్​ అన్నాడు.

సెంచూరియన్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా 113 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్​లో 1-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చూడండి: IND VS SA: తొలి టెస్టులో టీమ్​ఇండియా ఘన విజయం

Last Updated : Dec 30, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.