ETV Bharat / sports

మటన్​ రోల్​​ కోసం కోహ్లీ రిస్క్​.. కారును వెంబడించిన దుండగులు - కోహ్లీ మటన్​ రోల్​

Kohli mutton roll: ఫిట్​నెస్​కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే టీమ్​ఇండియా బ్యాటర్​ కోహ్లీ.. ఆహార ప్రియుడని మీకు తెలుసా? మటన్​ రోల్​ కోసం తన ప్రాణాన్నే రిస్క్​లో పెట్టి ​ దుండగుల నుంచి తప్పించుకున్నాడంటే నమ్మగలరా ? ఈ సంగతేంటో తెలుసుకుందాం..

kohli
కోహ్లీ
author img

By

Published : Mar 8, 2022, 1:59 PM IST

Kohli mutton roll: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఫిట్​నెస్​కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైట్​ కూడా క్రమం తప్పుకుండా పాటిస్తాడు. అయితే విరాట్​ ఆహార ప్రియుడని మీకు తెలుసా? రోడ్డు పక్కన చిరుతిండ్లంటే ఎంతో ఇష్టంగా లాగించేస్తాడని తెలుసా? అతడికి ఫుడ్​ అంటే ఎంత ఇష్టమంటే.. ఓ సారి మటన్​ రోల్​ కోసం ఏకంగా తన ప్రాణాన్నే రిస్క్​లో పెట్టాడట! ఈ విషయాన్ని విరాట్​ మిత్రుడు, సహ ఆటగాడు ప్రదీప్​ సంగ్వాన్​ తెలిపాడు.

"జూనియర్​ క్రికెట్​లో 7-8 ఏళ్లు నేను, కోహ్లీ రూమ్​మేట్స్​. అతడు మంచి ఆహార ప్రియుడు. ముఖ్యంగా రోడ్ల పక్కన ఉండే చిరుతిళ్లను బాగా ఇష్టపడతాడు. కోర్మ రోల్స్​, చికెన్​ రోల్స్​ బాగా తింటాడు. మేము దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు.. ఓ ప్రాంతంలో మటన్​రోల్​ సూపర్​గా ఉంటుందని ఎవరో చెప్పారు. అయితే అక్కడ దుండగులు, జేబు దొంగలు కూడా ఉంటారన్నారు. ఓ సారి ఆ ప్రాంతంలో కొంతమంది దుండగులు కలిసి ఒకరి చెయ్యి నరికేశారని మా డ్రైవర్​ కూడా చెప్పాడు. నేను భయపడ్డాను. కానీ విరాట్​ మాత్రం 'పద వెళ్దాం.. ఏం కాదు' అని అన్నాడు. నన్ను కూడా తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి మటన్​ రోల్​ తినేశాం. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు మమ్మల్ని ఛేస్​​ చేయడం ప్రారంభించారు. కానీ మేం మా కారుని ఎక్కడా ఆపకుండా గమ్యస్థానానికి చేరుకున్నాం."

-ప్రదీప్​ సాంగ్వాన్.

ప్రస్తుతం టీమ్​ఇండియా శ్రీలంకతో టెస్టు సిరీస్​ ఆడుతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇదీ చూడండి: ఈ​ అథ్లెట్​కు బికినీలోనే ఉండటం ఇష్టమట​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.