ETV Bharat / sports

'కోహ్లీకి 32 సంవత్సరాలే.. తొందర్లోనే మళ్లీ సెంచరీల జోరు' - టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్​ మహమ్మద్​ యూసుఫ్. ప్రస్తుతం అతడు సంధి కాలంలో ఉన్నాడని.. ఒక్కసారి కుదుటపడితే, త్వరలోనే తిరిగి సెంచరీలు చేస్తాడని తెలిపాడు.

virat kohli, team india captain
విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
author img

By

Published : May 1, 2021, 2:18 PM IST

టీమ్​​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్​ మహమ్మద్ యూసుఫ్​. ప్రస్తుతం అతడు సంధికాలంలో ఉన్నాడని.. త్వరలోనే తిరిగి అన్ని ఫార్మాట్లలో సెంచరీల జోరు చూపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్​మెన్లలో ఒకడైన కోహ్లీ.. 2019 నుంచి ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరు అందుకోలేకపోతున్నాడు.

"ప్రస్తుతం కోహ్లీ వయసు 32. ఇది అతనికి మంచి సమయమని చెప్పొచ్చు. ప్రస్తుతం సంధికాలంలో ఉన్నాడు. త్వరలోనే తిరిగి అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేస్తాడు. నాకు తెలిసి విరాట్ ఇప్పటికే.. అందుకోవాల్సిన ఘనతలన్నీ సాధించాడు. వన్డే, టెస్టుల్లో కలిపి ఇప్పటికే 70 సెంచరీలు చేశాడు."

-మహమ్మద్ యూసుఫ్, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్.

ఇదీ చదవండి: ఐపీఎల్​- 14: బ్యాటింగ్​, బౌలింగ్​లో వీరే 'టాప్​'

అయినప్పటికీ.. కోహ్లీని దిగ్గజ క్రికెటర్ సచిన్​తో పోల్చడం మాత్రం సరికాదని సూచించాడు యూసుఫ్. "సచిన్​ తెందుల్కర్​ దిగ్గజ ఆటగాడు. అతడు 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. అతడు ఎలాంటి బౌలర్లను ఎదుర్కొన్నాడో గుర్తుంచుకోవాలి" అని యూసుఫ్ వ్యాఖ్యానించాడు.

ఇండియాలో ఇప్పటికీ టెక్నిక్​తో బ్యాటింగ్​ చేసే క్రికెటర్లు పుట్టుకొస్తున్నారని మాజీ బ్యాటింగ్ దిగ్గజం ప్రశంసించాడు. ప్రతి తరానికి ఒక రోల్​ మోడల్​ తయారవుతున్నాడని కొనియాడాడు. ఒకరిని ఒకరు అనుసరిస్తున్నారని తెలిపాడు. 'ఇంజమామ్ ఉల్​ హక్​, సయ్యద్​ అన్వర్​ వంటి దిగ్గజాల హయాంలో ఆడిన నేనెంతో అదృష్టవంతుడిని' అని యూసుఫ్ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్​ టైటిలే లక్ష్యంగా చెన్నై 'కింగ్స్'​ గర్జన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.