ETV Bharat / sports

కోహ్లీనీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా: పైన్​ - బోర్డర్ గావస్కర్ ట్రోఫీ

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్​మన్​ అని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్. కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని అన్నాడు.

Kohli is best batsman in world, can get under your skin: Paine
కోహ్లీ
author img

By

Published : May 16, 2021, 8:00 PM IST

Updated : May 16, 2021, 8:41 PM IST

భారత క్రికెట్​ జట్టు సారథి విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్. తన ఆటతో ప్రత్యర్థి జట్టును మైమరపిస్తాడని అన్నాడు. ఓ కార్యక్రమంలో భాగంగా 2018-19లో భారత్.. ఆస్ట్రేలియా పర్యటనను గుర్తుచేసుకుంటూ.. గట్టి పోటీ ఇచ్చే విరాట్ ను ఎన్నటికీ మర్చిపోనని చెప్పాడు.

kohli
కోహ్లీ

"కోహ్లీ గురించి ఈ విషయం చాలా సార్లు చెప్పాను. అతడిని ఎవరైనా తమ జట్టులో కోరుకుంటారు. పోటీతత్వం ఉన్నవాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్. అతడితో ఆడటం సవాలుతో కూడినది. తన ప్రదర్శనతో ప్రత్యర్థిని ఆకట్టుకోగలడు. నాలుగేళ్ల కింద అతడితో గొడవ జరిగింది. అతడిని నేనెప్పుడూ గుర్తుపెట్టుకుంటాను."

-టిమ్ పైన్, ఆస్ట్రేలియా సారథి

కోహ్లీ నేతృత్వంలో 2018-19లో 2-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కైవసం చేసుకొని ఆస్ట్రేలియా గడ్డపై తన తొలి టెస్టు సిరీస్ విజయం సాధించింది టీమ్ఇండియా.

ఇదీ చూడండి: 'టీమ్ఇండియా అద్భుతాలు చేయగలదు'

Last Updated : May 16, 2021, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.