ETV Bharat / sports

విరుష్క జోడీ విరాళాల సేకరణ రూ.11 కోట్లు - Kohli and Anushka's COVID fund

కొవిడ్​పై పోరాటంలో భాగంగా విరుష్క జోడీ ప్రారంభించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి ఆదరణ బాగా లభిస్తోంది. రెండు రోజులు మిగిలి ఉండగానే అనుకున్న లక్ష్యం కన్నా నాలుగు కోట్ల రూపాయలు అధికంగా విరాళాలు వచ్చాయి.

virushka
విరుష్క జోడీ
author img

By

Published : May 12, 2021, 8:09 PM IST

కొవిడ్​తో పోరాడుతున్న మన దేశానికి అండగా నిలిచేందుకు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క కలిసి ప్రారంభించిన విరాళాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు రూ.11 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి.

మొత్తం వారం రోజుల్లో రూ.7 కోట్ల నిధులను సేకరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది విరుష్క జోడీ. ప్రముఖ విరాళాల సేకరణ వెబ్​సైట్​ కెట్టో ద్వారా ఆర్థిక సాయం అందించాలని మే7న తమ అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. తమ వంతు సాయంగా రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. అయితే ఇంకా రెండు రోజులు మిగిలి ఉండగానే అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు సమకూరాయి. ఇందులో ఎమ్​పీఎల్​ స్పోర్ట్​ ఫౌండేషన్ ఒక్కటే​ రూ.5 కోట్లు ఇవ్వడం విశేషం.

ఇదీ చూడండి: కొవిడ్​ పోరాటంలో విరుష్క జోడీ రూ.2 కోట్ల విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.