ETV Bharat / sports

క్రికెటర్ కేఎల్​ రాహుల్​ ఇంట్లో పెళ్లి బాజాలు! - ind vs wi 1st odi

KL Rahul News: టీమ్​ఇండియా వైస్​ కెప్టన్​ కేఎల్​ రాహుల్​ విండీస్​తో తొలి వన్డేకు దూరమయ్యాడు. రాహుల్​ ఇంట త్వరలో పెళ్లి వేడుకలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ పనుల్లో రాహుల్​ బిజీగా ఉన్నాడని సమాచారం.

kl rahul
కేఎల్​ రాహుల్
author img

By

Published : Feb 3, 2022, 3:28 PM IST

KL Rahul News: భారత్​-విండీస్​ మధ్య జరగబోయే వన్డే సిరీస్​ ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే తొలి వన్డేకు వైస్​ కెప్టన్​ కేఎల్​ రాహుల్​ దూరమయ్యాడు. రాహుల్​ గైర్హాజరు వెనుక కారణం అతని ఇంట్లో పెళ్లి బాజాలు మోగడమే అని సమాచారం. త్వరలో రాహుల్​ చెల్లెలి వివాహం ఉండటం వల్ల ఆ పనుల్లో రాహుల్​ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. రాహుల్​ రెండో వన్డేలో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది.

మరోవైపు రాహుల్​.. బాలీవుడ్​ సీనియర్​ నటుడు సునీల్​ శెట్టి కుమార్తె అతియా శెట్టితో ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వన్డే వాయిదా?

విండీస్​తో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్​పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫిబ్రవరి 6న జరగనున్న తొలి మ్యాచ్​ రెండు మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉందని క్రికెట్​ వర్గాలు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. కాగా, ఇప్పటికే ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్​ సెషన్​ను కూడా రద్దు చేశారు.

ఇదీ చూడండి : IND VS WI: భారత్​-వెస్టిండీస్​ వన్డే సిరీస్​ వాయిదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.