ETV Bharat / sports

KL Rahul Asia Cup 2023 : అభిమానులకు షాకింగ్​ న్యూస్​.. ఆ రెండు మ్యాచ్​లకు కేఎల్​ రాహుల్​ దూరం.. - ఆసియా కప్​ 2023 టీమ్ఇండియా

KL Rahul Asia Cup 2023 : రానున్న ఆసియా కప్​కు సర్వం సిద్ధమౌతున్న వేళ క్రికెట్​ లవర్స్​కు ఓ షాకింగ్​ న్యూస్​ ఇచ్చింది టీమ్ఇండియా. గాయల నుంచి కోలుకుని జట్టులో స్థానం సంపాదించుకున్న స్టార్​ క్రికెటర్​ కేఎల్ రాహుల్​.. ఆసియా కప్​లో భాగంగా జరగనున్న తొలి రెండు మ్యాచ్​లకు అందుబాటులో ఉండకపోవచ్చని టీమ్ఇండియా ప్రధాన కోచ్​ కేఎల్ రాహుల్​ తెలిపారు.

KL Rahul Asia Cup 2023
కేఎల్​ రాహుల్ ఆసియా కప్
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 1:34 PM IST

Updated : Aug 29, 2023, 4:17 PM IST

KL Rahul Asia Cup 2023 : రానున్న ఆసియా కప్​కు సర్వం సిద్ధమౌతున్న వేళ క్రికెట్​ లవర్స్​కు ఓ షాకింగ్​ న్యూస్​ ఇచ్చింది టీమ్ఇండియా. గాయల నుంచి కోలుకుని జట్టులో స్థానం సంపాదించుకున్న స్టార్​ క్రికెటర్​ కేఎల్ రాహుల్​.. ఆసియా కప్​లో భాగంగా జరగనున్న తొలి రెండు మ్యాచ్​లకు అందుబాటులో ఉండకపోవచ్చని టీమ్ఇండియా ప్రధాన కోచ్​ కేఎల్ రాహుల్​ తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌ కోసం ఇండియా టీమ్ శ్రీలంకకు బయలుదేరనున్నది. ఇక కేఎల్‌ రాహుల్ మరో వారం తర్వాత వెళ్లి జట్టుతో కలువనున్నాడు.

  • UPDATE

    KL Rahul is progressing really well but will not be available for India’s first two matches – against Pakistan and Nepal – of the #AsiaCup2023: Head Coach Rahul Dravid#TeamIndia

    — BCCI (@BCCI) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 Schedule : ఆసియా కప్‌లో భారత్.. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో, అదే నెల 4న నేపాల్‌తో తలపడనుంది. ఇక ఈ సారి ఆసియా కప్‌నకు పాకిస్థాన్‌, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా... గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక తలపడనున్నాయి. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆగస్టు 30 నుంచి మొదలవుతాయి. సూపర్‌ 4 మ్యాచ్‌లు సెప్టెంబరు 6 నుంచి ఉంటాయి. సెప్టెంబరు 17న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

KL Rahul Injury : ఇక గాయం కార‌ణంగా టీమ్​ఇండియాకు కొంత కాలం పాటు దూర‌మైన కేఎల్ రాహుల్ ఇప్పుడు ఆసియా క‌ప్‌తో జ‌ట్టులోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. వికెట్ కీప‌ర్ క‌మ్ బ్యాట్స్‌మెన్ కోటాలో సెలెక్ట‌ర్లు కేఎల్ రాహుల్‌ను ఈ జట్టు కోసం ఎంపిక‌ చేశారు. అయితే ఐపీఎల్‌తో పాటు అంత‌కుముందు సిరీస్‌ల‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరుపై చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. వాటిపై గతంలో రాహుల్​ స్పందించారు కూడా. కానీ ఆ త‌ర్వాత గాయం కార‌ణంగా అనూహ్యంగా ఐపీఎల్ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు.

మరోవైపు ఆసియా క‌ప్‌లో రాహుల్ ఎలా ఆడ‌నున్నాడు అన్నది క్రికెట్ అభిమానులు ఆస‌క్తిక‌రంగా మారింది. ఆసియా కప్​ కోసం ఇప్పటివరకు బెంగ‌ళూరులో టీమ్​ఇండియా తీవ్ర ప్రాక్టీస్​ చేసింది. అక్కడ కే ఎల్ రాహుల్ క‌ఠిన సాధ‌న చేస్తూ.. బ్యాటింగ్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. అలా ప్రాక్టీస్ సెష‌న్‌లో అల‌వోక‌గా సిక్స‌ర్లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో నెట్టింట వైరల్​ కాగా.. దీన్ని చూసిన ఫ్యాన్స్​.. 'రాహుల్ ఈజ్ బ్యాక్' అంటూ నెట్టింట కామెంట్ల వర్షాన్ని కురిపించారు.

KL Rahul Fitness : రాహుల్​ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి! ఫిట్​గా లేనప్పుడు అవసరమా?

'ట్రోలింగ్ ఆటగాళ్లను దెబ్బతీస్తోంది.. తిట్టడమే వారి హక్కు అన్నట్లు చేస్తున్నారు'

Last Updated : Aug 29, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.