Kl Rahul Against South Africa : భారత్-సౌతాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా టెస్టు సిరీస్ మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభమైంది. టాస్ గెలిచి ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. పూర్తిగా పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై సఫారీ బౌలర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5) విఫలం కాగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (38) ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం వల్ల భారత్ 200 మార్క్ అందుకోవడం కష్టమే అనిపించింది. ఈ దశలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. క్రీజులో నిలదొక్కుకొని స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 208-8తో నిలిచింది.
అయితే సౌతాఫ్రికా పిచ్‌ల్లో టీమ్ఇండియాకు వెన్నుముకలాగా నిలుస్తున్నాడు రాహుల్. గత పర్యటనలోనూ డీసెంట్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 2021 సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ 123 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 113 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ మ్యాచ్‌లో 146 పరుగులు చేసిన రాహుల్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక అదే పర్యటనలో జొహెన్నస్‌బర్గ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 49-3 తో నిలిచిన టీమ్ఇండియాను ఆదుకున్నాడు. 133 బంతుల్లో 50 పరుగులు చేసి వికెట్ల పతనాన్ని అడ్డుతున్నాడు. కానీ, ఆ తర్వాత పుంజుకున్న సఫారీలు భారత్‌ను 202 పరుగులకు ఆలౌట్ చేశారు.
-
THAT moment when @klrahul got to his half-century in Centurion. 🙌🏽 #TeamIndia #SAvIND pic.twitter.com/6O6jibCJMk
— BCCI (@BCCI) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">THAT moment when @klrahul got to his half-century in Centurion. 🙌🏽 #TeamIndia #SAvIND pic.twitter.com/6O6jibCJMk
— BCCI (@BCCI) December 26, 2023THAT moment when @klrahul got to his half-century in Centurion. 🙌🏽 #TeamIndia #SAvIND pic.twitter.com/6O6jibCJMk
— BCCI (@BCCI) December 26, 2023
ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లోనూ రాహుల్ సహనం కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్ 70* స్కోర్‌తో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు మరో 60-80 పరుగులు జోడిస్తే, గౌరప్రదమైన స్కోర్ దక్కుతుంది. కాగా రాహుల్ రీసెంట్ ఇన్నింగ్స్‌పై టీమ్ఇండియా కోచ్ స్పందించాడు.'రాహుల్ కచ్చిమైన గేమ్ ప్లాన్‌తో ఆడతాడు. అతడు కఠినమైన బంతులను రిస్క్ షాట్లకు పోకుండా డిఫెన్స్ ఆడుతాడు. తన బ్యాటింగ్ పట్ల అతడు పక్కా క్లియర్‌గా ఉంటాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ రాహుల్ మమ్మల్ని ఆదుకుంటున్నాడు' అని కోచ్ అన్నాడు.
-
Indian batting coach said "Every time there is a tough situation, KL Rahul is the guy who handles it well for us". pic.twitter.com/9fQLqdDRDk
— Johns. (@CricCrazyJohns) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indian batting coach said "Every time there is a tough situation, KL Rahul is the guy who handles it well for us". pic.twitter.com/9fQLqdDRDk
— Johns. (@CricCrazyJohns) December 27, 2023Indian batting coach said "Every time there is a tough situation, KL Rahul is the guy who handles it well for us". pic.twitter.com/9fQLqdDRDk
— Johns. (@CricCrazyJohns) December 27, 2023
ఆ టెస్టు జట్టులో విరాట్‌కు నో ప్లేస్ - నెట్టింట ఫ్యాన్స్ ఫైర్!
టీమ్ఇండియాకు వీళ్లే కీలకం!- సఫారీ గడ్డపై ఎవరి ప్రదర్శన ఎలా ఉందంటే?