ETV Bharat / sports

'ఆ లక్షణాలు పంత్​లో చాలా ఉన్నాయి'

భవిష్యత్​ భారత కెప్టెన్​గా పనిచేయగల సామర్థ్యం టీమ్​ఇండియా యువ క్రికెటర్​ రిషభ్ పంత్​కు ఉందని అభిప్రాయపడ్డారు మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే. తొలుత వన్డేలతో పాటు టీ20లకు జట్టులో స్థానం దక్కించుకోలేక పోయిన పంత్.. టెస్టు క్రికెట్ ద్వారా తానెంటో నిరూపించుకున్నాడని తెలిపారు.

author img

By

Published : May 28, 2021, 4:46 PM IST

rishabh pant, team india cricketer
రిషభ్ పంత్, టీమ్ఇండియా క్రికెటర్

యువ క్రికెటర్​ రిషభ్ పంత్.. టీమ్​ఇండియా భవిష్యత్ కెప్టెన్​ అని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే అభిప్రాయపడ్డారు. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపారు. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు సారథ్యం వహించిన అనుభవం అతనికి పనికొస్తుందని పేర్కొన్నారు.

"రిషభ్ పంత్.. భవిష్యత్​లో టీమ్​ఇండియా కెప్టెన్​గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సారథికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పంత్​కు ఉన్నాయి. అతడి కెరీర్​ను ఓసారి పరిశీలిస్తే ప్రారంభంలో చాలా ఒడుదొడుకులు కనిపిస్తాయి. మొదట్లో అతడు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల వల్లే అతడు మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తొలుత ప్రపంచకప్​కు ఎంపిక కాలేదు. టీ20లతో పాటు వన్డేలకూ జట్టులోకి తీసుకోలేదు. కానీ, అతడు అనూహ్యంగా టెస్టు ఫార్మాట్​ ద్వారా టీమ్​లోకి వచ్చాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు." ​

-కిరణ్ మోరే, టీమ్ఇండియా మాజీ సెలెక్టర్.

ఇటీవల ఆసీస్​తో టెస్టు సిరీస్​లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు పంత్. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల్లో 274 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. జట్టుకు కీలకమైన సమయాల్లో రాణించాడు. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​లోనూ 270 పరుగులు చేసి జట్టుకు తానెంత ముఖ్యమైన ఆటగాడనేది నిరూపించాడు.

ఇదీ చదవండి: BCCI SGM: ఐపీఎల్, టీ20 ప్రపంచకప్​ గురించే చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.