ETV Bharat / sports

'వాళ్లు పెద్ద ఆటగాళ్లే అయితే.. అలాంటి ప్రదర్శనలే చేయాలి'

author img

By

Published : Jun 6, 2022, 9:41 PM IST

కెప్టెన్​ రోహిత్​ శర్మ, మాజీ సారథి విరాట్​ కోహ్లీ, కేఎల్​ రాహుల్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు దిగ్గజ సారథి కపిల్​ దేవ్​. ఒత్తిడికి గురికాకుండా ఆడాలని.. పేరుకే గొప్ప ఆటగాళ్లైతే సరిపోదు. ప్రదర్శన కూడా అలాగే ఉండాలిని చురకలంటించారు.

Kapil Dev
కపిల్​ దేవ్​

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఎలా ఆడనుందనే విషయంపై ఆసక్తి పెరిగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తిగా మారింది. అయితే, ఇదే విషయంపై దిగ్గజ సారథి కపిల్‌ దేవ్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ తీరుపై స్పందించారు. రోహిత్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా ఆడాలన్నారు.

" ఈ ముగ్గురూ పెద్ద ఆటగాళ్లే. వారిపై భారీ అంచనాలు ఉండటం వల్ల కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఉన్నారు. అయితే, అది వారికి సమస్య కాకూడదు. వీరు భయం లేకుండా, ధాటిగా ఆడాలి. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌.. 150-160 స్ట్రైక్‌రేట్‌తో ఆడగల సత్తా ఉన్న ఆటగాళ్లే. అంత గొప్ప బ్యాట్స్‌మెన్‌ అయినా కీలక సమయాల్లో చేతులెత్తేస్తున్నారు. పరుగులు చేయాల్సినప్పుడు ఔటవుతున్నారు. వాళ్లు క్రీజులో నిలవాలంటే మొదట కొన్ని బంతులు ఆడితే మంచిది. కానీ, నాలుగైదు ఓవర్లు ఆడాక ఔటైతే ఎలా?"

- కపిల్‌ దేవ్​

గేర్‌ మార్చి ధనాధన్‌ బ్యాటింగ్‌ చేయాల్సినప్పుడు ఔటైతేనే ఒత్తిడికి గురవుతారని.. వాళ్లు హీరోలుగా మిగలాలనుకుంటున్నారా లేక జీరోలుగా మారాలనుకుంటున్నారా అనేది ఆయా ఆటగాళ్లు, జట్టే నిర్ణయించుకోవాలని సూచించారు కపిల్​ దేవ్​. వాళ్లు తమ ఆటతీరు మార్చుకోవాలని.. అది సాధ్యంకాకపోతే వారిని తప్పించాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్లు నిజంగా పెద్ద ఆటగాళ్లే అయితే, అలాంటి ప్రదర్శనలే చేయాలి. పేరుకే గొప్ప ఆటగాళ్లైతే సరిపోదు. ప్రదర్శన కూడా అలాగే ఉండాలిని చురకలంటించారు.

ఇదీ చూడండి: వకార్‌ కాదు.. వారే నాకు స్ఫూర్తి: ఉమ్రాన్ మాలిక్‌

సిరాజ్​ వల్లే అతనితో గొడవ జరిగింది: రియాన్​ పరాగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.