ETV Bharat / sports

'కోహ్లీ, విలియమ్సన్​ స్నేహం.. అదే కారణం!

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మంచి స్నేహితులు! అయితే వీరిద్దరి స్వభావాలు మాత్రం వేరు. ఈ నేపథ్యంలో కోహ్లీతో తనకున్న స్నేహం గురించి విలియమ్సన్ మాట్లాడాడు. తమ స్నేహం ఎప్పుడు మొదలైందో చెప్పాడు.

Kohli, Williamson
కోహ్లీ, విలియమ్సన్
author img

By

Published : Jun 30, 2021, 11:46 AM IST

న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్.. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మ్యాచ్​ ఫలితం ఎలా ఉన్నా సరే ముఖం మీద చిరునవ్వుతో ఎప్పుడూ ప్రశాంతగా కనిపిస్తాడు. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ విషయానికి వస్తే దూకుడైన స్వభావంతో ఉంటాడు. వీరిద్దరినీ నీరు, నిప్పునకు ఉదాహరణగా చెప్పొచ్చు. కానీ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఈ విషయంపైనే స్పందించిన విలియమ్సన్​ అందుకు గల కారణాన్ని వెల్లడించాడు.

"చాలా కాలం నుంచి కోహ్లీతో నాకు మంచి స్నేహబంధం ఉంది. ప్రపంచంలోని వివిధ స్వభావాలున్న క్రీడాకారుల్ని స్పోర్ట్స్ మనకు పరిచయం చేస్తుంది. వారితో స్నేహం చేసేలా చేస్తుంది. ఇదే క్రీడల గొప్పతనం. కోహ్లీకి, నాకూ కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయి. చాలా రకాల విషయాల గురించి మేం కలిసినపుడు చర్చించుకుంటాం"

-విలియమ్సన్, కివీస్ సారథి

Kohli, Williamson
కోహ్లీ, విలియమ్సన్

కోహ్లీ, విలియమ్సన్​ 2008లో మలేసియాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్​లో తొలిసారిగా కలిశారు. ఈ టోర్నీలో కివీస్​ను సెమీఫైనల్లో ఓడించి ఫైనల్​కు వెళ్లింది కోహ్లీసేన. తర్వాత తుదిపోరులో దక్షిణాఫ్రికాపై 12 పరుగుల తేడాతో విజయం సాధించి కోహ్లీసేన విజేతగా నిలిచింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.