Kane Williamson Catch: ఐపీఎల్ 2022 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 211 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఓవర్లోనే కేన్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఔటయ్యాడు. అయితే అదే వివాదాస్పదంగా మారింది. కీపర్ సంజు శాంసన్ చేతుల్లో పడి మిస్సైన బంతిని.. స్లిప్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ అందుకున్నాడు. అయితే.. దాన్ని పలు మార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్.. విలియమ్సన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై ఎస్ఆర్హెచ్ సహా క్రికెట్ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. రీప్లేలో బంతి స్పష్టంగా నేలకు తాకినట్లుగా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
-
Poor showcase of third umpiring..
— Rahul Kumar (@rahul98891) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Baised decision from third umpire @JimmyNeesh#KaneWilliamson #poorumpiring #IPL #srhvsrr pic.twitter.com/bq67OVBk0L
">Poor showcase of third umpiring..
— Rahul Kumar (@rahul98891) March 29, 2022
Baised decision from third umpire @JimmyNeesh#KaneWilliamson #poorumpiring #IPL #srhvsrr pic.twitter.com/bq67OVBk0LPoor showcase of third umpiring..
— Rahul Kumar (@rahul98891) March 29, 2022
Baised decision from third umpire @JimmyNeesh#KaneWilliamson #poorumpiring #IPL #srhvsrr pic.twitter.com/bq67OVBk0L
అయితే.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఈ అంశంపై బీసీసీఐకి ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం. మ్యాచ్ అయిపోయాక.. రిఫరీకి కెప్టెన్ ఇచ్చే నివేదికలో కూడా దీని గురించి ప్రస్తావించినట్లు ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది. 'అవును. మేం బీసీసీఐకి లేఖ రాశాం. అసలు ప్రాసెస్ ఏంటంటే.. ఈ అంశంపై కోచ్ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దాన్ని అనుసరిస్తాం.'' అని సన్‌రైజర్స్ యాజమాన్యం పేర్కొంది. మ్యాచ్ అనంతరం.. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ కూడా దీనిపై స్పందించాడు. రీప్లేలో చూశాక అసలు విషయం తెలిసిందని, అసలు థర్డ్ అంపైర్ దేనిని పరిగణనలోకి తీసుకొని అవుట్ ఇచ్చాడో అని ఆశ్చర్యపోయాడు.
ముంబయిలోని ఎంసీఏ స్టేడియంలో మార్చి 29న జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్.. కెప్టెన్ సంజూ శాంసన్ (50), పడిక్కల్ (41) చెలరేగడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 210 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ తేలిపోయింది. మార్క్రమ్ (57), సుందర్ (40) మినహా ఏ ఒక్కరూ బ్యాటింగ్‌లో రాణించలేదు. దీంతో ఎస్ఆర్హెచ్ ప్రదర్శన పట్ల తీవ్ర నిరాశకు గురైన అభిమానులు.. సామాజిక మాధ్యమాల్లో జట్టును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఆ నలుగురు బ్యాటింగ్‌లో అస్సలు కంగారు పడరు'