ETV Bharat / sports

'టెస్టు, వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్'​గా రూట్​, బాబర్​ - టెస్టు ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​ 2021

ICC Men's Test, ODI Cricketer of 2021: వన్డే, టెస్టు ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డులను ప్రకటించింది ఐసీసీ. పాకిస్థాన్​ సారథి బాబర్​ అజామ్​కు వన్డే.. ఇంగ్లాండ్​ కెప్టెన్​కు జో రూట్​కు టెస్టు ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​ పురస్కారం వరించింది. కాగా, దక్షిణాఫ్రికా అంపైర్​ మారయిస్​ ఎరాస్మస్​కు అంపైర్​ ఆఫ్​ ఇయర్​ దక్కింది.

ICC Men's Test Cricketer of 2021
ICC Men's Test Cricketer of 2021
author img

By

Published : Jan 24, 2022, 2:23 PM IST

Updated : Jan 24, 2022, 2:33 PM IST

ICC Men's Test, ODI Cricketer of 2021: పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​కు వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​, ఇంగ్లాండ్​ సారథి జో రూట్​కు టెస్టు ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డులు వరించాయి. దక్షిణాఫ్రికాపై 2-1తేడాతో పాక్​.. సిరీస్ సొంతం చేసుకోవడంలో బాబర్​ కీలక పాత్ర పోషించాడు. 228 అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్​గా నిలిచాడు. ఇంగ్లాండ్​తో జరిగిన మూడు మ్యాచ్​లు సిరీస్​లో పాక్​ క్లీన్​స్వీప్​ అయినప్పటికీ బాబర్​ ఒంటరిగా పోరాడి 177 పరుగులు చేశాడు.

2021లో 15 మ్యాచులు ఆడిన జో రూట్​.. 1708 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక, భారత్​పై ఆడిన సిరీస్​లలో అద్భుతంగా రాణించాడు. ఈ కారణంగానే వారికి ఈ పురస్కారాలను అందించింది ఐసీసీ.

కాగా, దక్షిణాఫ్రికా అంపైర్​ మారయిస్​ ఎరాస్మస్​కు అంపైర్​ ఆఫ్​ ఇయర్ అవార్డు​ దక్కింది. అంతకుముందు 2016, 2017లోనూ అతడు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​'గా పాక్​ క్రికెటర్​

Last Updated : Jan 24, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.