ETV Bharat / sports

జై షాపై రణతుంగ అనుచిత వ్యాఖ్యలు- ఖండించిన శ్రీలంక ప్రభుత్వం - జై షాపై ఆరోపణలు శ్రీలంక ప్రభుత్వం

Jay Shah Arjuna Ranatunga Comments : బీసీసీఐ అధ్యక్షుడు జై షాపై శ్రీలంక మాజీ క్రికెటర్​ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం స్పందించింది. ఈ మేరకు శ్రీలంక పార్లమెంట్​లో ఆ దేశ మంత్రులు జై షాపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

Jay Shah Arjuna Ranatunga Comments
Jay Shah Arjuna Ranatunga Comments
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 8:59 PM IST

Updated : Nov 17, 2023, 10:35 PM IST

Jay Shah Arjuna Ranatunga Comments : భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షాపై మాజీ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యలకై ఆ దేశ ప్రభుత్వం స్పందించింది. రణతుంగ వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసింది. జైషాపై చేసిన వ్యాఖ్యలను ఖండించింది. శుక్రవారం జరిగిన శ్రీలంక పార్లమెంట్​ సమావేశాల్లో మంత్రులు హరీన్ ఫెర్నాండో, కాంచన విజేశేఖర ప్రకటించారు.

'జై షాపై కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను శ్రీలంక ప్రభుత్వం ఖండిస్తోంది. మా క్రికెట్ బోర్డులోని లోపాలను ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఆపాదించలేం. అది పూర్తిగా తప్పుడు భావన' అని మంత్రి విజేశేఖర పార్లమెంట్​లో ప్రకటించారు. దీంతో పాటు శ్రీలంక క్రికెట్‌ బోర్డు- ఎస్​ఎల్​సీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని జై షాను శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే కోరినట్లు మంత్రి హరీన్‌ ఫెర్నాండో వెల్లడించారు. లేకుంటే నిషేధం ప్రభావం వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్‌పై పడే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ నిషేధం ఎత్తేయకుంటే.. శ్రీలంకకు ఎవరూ రారని.. క్రికెట్‌ టోర్నమెంట్‌ ద్వారా శ్రీలంకకు ఆర్థికంగా ఎలాంటి లాభం ఉండదు అని హరీన్‌ ఫెర్నాండో పేర్కొన్నారు.

2023 వన్డే వరల్డ్​ కప్​లో శ్రీలంక జట్టు ఘోర వైఫల్యం చెందింది. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌సీని.. బీసీసీఐ కార్యదర్శి జై షా నియంత్రిస్తున్నారని శ్రీలంక మాజీ క్రికెటర్‌ అర్జున రణతుంగ ఆరోపించారు. 'ఎస్‌ఎల్‌సీ అధికారులు, బీసీసీఐ మధ్య ఉన్న పరిచయాలతో వారు శ్రీలంక క్రికెట్ బోర్డును నియంత్రించగలమని భావిస్తున్నారు. జై షా కనుసన్నల్లో ఎస్‌ఎల్‌సీ పనిచేస్తుంది. జై షా ఒత్తిడితోనే ఎస్‌ఎల్‌సీ నాశనం అయింది' అని రణతుంగ ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉండగా ప్రపంచ కప్​లో శ్రీలంక వైఫల్యం కారణంగా ఎస్‌ఎల్‌సీని రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రి తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అక్కడి కోర్డు కొట్టేసింది.

వరల్డ్​ కప్​ ఫైనల్​కు​ అంపైర్లు ఖరారు అతడ్ని చూసి భయపడుతున్న అభిమానులు!

వాయుసేన విన్యాసాలు, పాప్ సింగర్ ప్రదర్శన, మోదీ హాజరు- ప్రపంచకప్ ఫైనల్ అదిరిపోవాల్సిందే!

Last Updated : Nov 17, 2023, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.