ETV Bharat / sports

టీమ్​ఇండియాకు బిగ్​ షాక్​.. ఆసియా కప్​కు స్టార్​ ప్లేయర్​​ దూరం - T20 World Cup

Bumrah Asia Cup: ఆసియా కప్​ టీ20 టోర్నమెంట్​కు ముందు టీమ్​ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్​ పేసర్​ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.

Jasprit Bumrah ruled out of Asia Cup with back injury

author img

By

Published : Aug 8, 2022, 8:14 PM IST

Bumrah Asia Cup: ప్రతిష్టాత్మక ఆసియా కప్​కు ముందు టీమ్​ఇండియాకు పెద్ద షాక్​ తగిలింది. సీనియర్​ ఫాస్ట్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా.. ఈ టోర్నీకి దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు బీసీసీఐ సీనియర్​ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసియా కప్​ కోసం భారత జట్టును సోమవారమే ఎంపిక చేయనుంది సెలక్షన్​ కమిటీ. అయితే.. జట్టును ఇవాళే ప్రకటిస్తారా లేదా అనేది స్పష్టత లేదు. గాయం తీవ్రతరం కాకుండా.. బుమ్రా టీ-20 వరల్డ్​కప్​ వరకు సిద్ధంగా ఉండేందుకే విశ్రాంతిని ఇస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.

''జస్​ప్రీత్​ బుమ్రా వెన్నుగాయంతో బాధపడుతున్నాడు. అతడు ఆసియా కప్​లో ఆడటం లేదు. బుమ్రా.. మా ప్రధాన బౌలర్​. టీ-20 వరల్డ్​ కప్​లో అతడు కచ్చితంగా జట్టులో ఉండాలి. అందుకే ఆసియా కప్​లో ఆడించి మేం రిస్క్​ చేయదల్చుకోలేదు. ఒకవేళ ఆడిస్తే.. గాయం తీవ్రతరం కావొచ్చు.''

- బీసీసీఐ సీనియర్​ అధికారి

వెస్టిండీస్​, జింబాబ్వే సిరీస్​ల కోసం ఇప్పటికే బుమ్రాకు విశ్రాంతినిచ్చింది సెలక్షన్​ కమిటీ. చివరగా ఈ స్టార్​ పేసర్​.. ఇంగ్లాండ్​ వన్డే సిరీస్​లో ఆడాడు. సెప్టెంబర్​-అక్టోబర్​లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా భారత్​లో పర్యటించనున్నాయి. అప్పటివరకు బుమ్రా జట్టులోకి చేరే అవకాశముంది. అంతకంటే ముందు బుమ్రా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీలో ఫిట్​నెస్​ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బుమ్రా.. తన కుటుంబంతో కలిసి అమెరికాలో హాలిడే ట్రిప్​ను ఎంజాయ్​ చేస్తున్నాడు.
ఆసియా కప్​ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. 28న భారత్​ తన తొలి మ్యాచ్​ను పాకిస్థాన్​తో ఆడనుంది. సెప్టెంబర్​ 11న ఫైనల్​.

ఇవీ చూడండి: హాకీలో భారత్ పసిడి​ ఆశలు ఆవిరి.. ఆసీస్​ చేతిలో చిత్తు.. సిల్వర్​తో సరి

స్పిన్నర్ల మాయ.. చివరి టీ-20లోనూ విండీస్ చిత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.