టీమ్‌ఇండియా ప్రధాన ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన అవకాశం దక్కుతుందా? మూడున్నర దశాబ్దాల్లో భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి పేసర్‌గా అతను నిలుస్తాడా? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో శుక్రవారం ఆరంభమయ్యే అయిదో టెస్టు కోసం టీమ్‌ఇండియా సారథ్యాన్ని అతనికే అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో ఈ కీలక మ్యాచ్‌లో జట్టును నడిపించే బాధ్యతలు బుమ్రాకే కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
వైరస్ సోకిన రోహిత్ నిబంధనల ప్రకారం అయిదు రోజుల ఐసోలేషన్‌లో ఉండాలి. సరిగ్గా మ్యాచ్ ఆరంభానికి ముందు అది ముగుస్తుంది. కానీ ఐసోలేషన్‌లో గడిపి వచ్చిన అతణ్ని నేరుగా మ్యాచ్ ఆడించే సాహసం చేయకపోవచ్ఛు మరోవైపు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ పర్యటనకే దూరమయ్యాడు. కోహ్లీ ఎలాగూ తిరిగి పగ్గాలు అందుకునే అవకాశం లేదు కాబట్టి ఈ మ్యాచ్ కోసం బుమ్రాను సారథిగా ఎంపిక చేయొచ్చు.
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గాయంతో రోహిత్ దూరమైతే రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. బుమ్రా వైస్‌కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు దిగ్గజం కపిల్ దేవ్ బాటలో సాగుతూ 1987 తర్వాత టెస్టుల్లో భారత్‌ను నడిపించే తొలి పేసర్‌గా అతను నిలిచే ఆస్కారముంది.
ఇదీ చూడండి: IND VS ENG: రోహిత్ స్థానంలో ఆ ప్లేయర్‌కు చోటు