ETV Bharat / sports

టీమ్​ ఇండియాకు గుడ్​ న్యూస్​.. వరల్డ్​ కప్​ జట్టులో ఆ బౌలర్లు - టీ20 వరల్డ్​ కప్ హర్షల్​ పటేల్​

T20 World Cup 2022 India Squad : అక్టోబర్​లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సెప్టెంబర్ 16న ప్రకటించనుంది. స్టార్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో సతమతమవుతుండటం కారణంగా.. సెలెక్షన్ కమిటీ టైమ్ తీసుకుంటుంది. అయితే జట్టులోకి వీరిద్దరి రాక లాంఛనమే అని సమాచారం.

Jasprit Bumrah Harshal Patel
Jasprit Bumrah, Harshal Patel set to be included in T20 World Cup squad: sources
author img

By

Published : Sep 11, 2022, 8:59 PM IST

T20 World Cup 2022 India Squad : అస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్​ కప్​ జట్టును బీసీసీఐ ఈ నెల 16న ప్రకటించనుంది. అయితే బుమ్రా, హర్షల్​ పటేల్​ను కూడా వరల్డ్​ కప్​ జట్టులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు బౌలర్లు గాయాల నుంచి కోలుకున్న కారణంగా జట్టులోకి ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు నేషనల్​ క్రికెట్​ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

బుమ్రా నెట్​లో రోజూ ప్రాక్టీస్​ చేస్తున్నాడని.. అతడిని ఓ మెడికల్​ బృందం పర్యవేక్షిస్తోందని సమాచారం. అయితే బుమ్రా ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇంకా ఫైనల్ ఫిట్​నెస్​​ టెస్ట్​ జరగలేదు. కానీ అతడు క్లియర్​ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా హర్షల్​ పటేల్​ కూడా బాగానే ఉన్నాడని.. సెలెక్షన్స్​కు అతడు అందుబాటులో ఉంటాడని సమాచారం. అయితే ఇదంతా ఆఖరి ఫిట్​నెస్ పరీక్షల మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

త్వరలో బీసీసీఐ సెలక్షన్ కమీటీ సమావేశం కానుంది. ఆలోపు ఆఖరి ఫిట్​నెస్ టెస్టును వీరిద్దరూ క్లియర్​ చేస్తే.. వరల్డ్​ కప్​ జట్టులోకి ఎంపిక సుగమమవుతుంది. ​గాయాల కారణంగా వీరిద్దరినీ ఆసియా కప్​ జట్టులోకి తీసుకోలేదు. టీ20 వరల్డ్​ కప్​ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి నవంబర్​ 13 వరకు జరగనుంది.

ఇవీ చదవండి: కోహ్లీపై దాదా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఏమన్నాడంటే?

యూఎస్​ ఓపెన్​ విజేతగా ఇగా స్వైటెక్‌.. తొలి క్రీడాకారిణిగా రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.