ETV Bharat / sports

దక్షిణాఫ్రికాకు టీమ్​ఇండియా.. ఎన్​సీఏలో రోహిత్, జడ్డూ - జడేజా తాజా వార్తలు

Jadeja Rohit Sharma At NCA: టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా బెంగళూరులోని నేషనల్​ క్రికెట్​ అకాడమీకి చేరుకున్నారు. గాయాల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన వీరిద్దరూ.. ఫిట్​నెస్​పై దృష్టి పెట్టారు.

rohit jadeja
రోహిత్ జడేజా
author img

By

Published : Dec 17, 2021, 3:10 PM IST

Jadeja Rohit Sharma At NCA: టీమ్​ఇండియా టీ20, వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ, ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా గాయాల కారణంగా భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తిరిగి ఫిట్​నెస్​ పొందేందుకు బెంగళూరులోని నేషనల్​ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు.
అండర్​-19 కెప్టెన్ యశ్ దుల్​తో కలిసి సీనియర్​ క్రికెటర్లు రోహిత్, జడ్డూ ఎన్​సీఏలో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. డిసెంబర్ 23 నుంచి ఆసియాకప్​ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమ్​ఇండియా అండర్-19 జట్టు ఎన్​సీఏకు చేరుకుని ప్రాక్టీస్​ షురూ చేసింది.
అయితే.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​కు గాయం కారణంగా దూరమైన రోహిత్ స్థానంలో ఇండియా ఏ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పంచాల్​ను ఎంపిక చేసింది బీసీసీఐ.
వన్డే సిరీస్​కు..
IND vs SA 2021: టీమ్​ఇండియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​కు రోహిత్​ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. రోహిత్​ కోలుకోవడానికి నాలుగు వారాలు పట్టొచ్చని వైద్య బృందం పేర్కొంది.

మరోవైపు, న్యూజిలాండ్​తో సిరీస్​లో గాయపడిన జడేజా కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చని సమాచారం.

ఇదీ చూడండి: కోహ్లీ​పై వార్నర్​ కంప్లైంట్.. ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.