ETV Bharat / sports

'మా జట్టు ప్లేఆఫ్స్​కు చేరకపోవడం సిగ్గుచేటు' - ఐపీఎల్​ 2022

ఈ ఐపీఎల్​ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ప్లేఆఫ్స్​కు చేరుకోకపోవడం సిగ్గు చేటు అన్నాడు ఆ జట్టు ఆల్​రౌండర్​, ఆస్ట్రేలియన్​ క్రికెటర్​ మిచెల్​ మార్ష్​. మెరుగైన ప్రదర్శన చేయలేని సమయంలో భారత్​లో నాకు కలిసిరాలేదని భావించానని పేర్కొన్నాడు.

mitchel marsh
మిచెల్​ మార్ష్
author img

By

Published : Jun 5, 2022, 8:51 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో కొత్త జట్ల ఎంట్రీతో ప్లేఆఫ్స్​ రేసు హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో సీజన్​ ఆరంభం నుంచి మంచి ప్రదర్శన ఇస్తున్న దిల్లీ క్యాపిటల్స్​కు ప్లేయాఫ్స్​ బెర్తు ఖాయమని అనుకునే సమయానికి సీన్​ రివర్స్​ అయింది. ముంబయితో తప్పక గెలవాల్సన మ్యాచ్​లో ఓటమిని మూటగట్టుకుని అభిమానులను నిరాశపరిచింది. ఆ స్థానంలో ఆర్​సీబీ ప్లేయాఫ్స్​కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన ఆ జట్టు ఆటగాడు మిచెల్​ మార్ష్​.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. దిల్లీ క్యాపిటల్స్​ ప్లేఆఫ్స్​కు చేరకపోవడం సిగ్గు చేటన్నాడు. 'రికీపాంటింగ్​ ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు. దిల్లీ జట్టుకు నేను ఓ కీలక ఆటగాడినని భావించేలా చేశాడు' అని పేర్కొన్నాడు.

ఇండియా కలిసిరాలేదు అనుకున్నా: ఈ సీజన్​ తొలిభాగంలో మిచెల్​ కాస్త తడబడ్డాడు. దానికి తోడు కరోనా బారిన పడేసరికి ఇండియా తనకు కలిసిరాలేదని అనుకున్నాడట మార్ష్​. "ఇకపై నిలకడగా ఆడేలా జాగ్రత్త పడతాను. అంతర్జాతీయ క్రికెట్​ ఆడటం కష్టమే కానీ అందులో ఆడగలను అనే నమ్మకం ఉండాలి. ప్రపంచంలో ఏ ఆటగాడితోనైనా దీటుగా ఆడగలిగే సత్తా నాకుందని నేను నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి : అప్పుడు కావాలనే సచిన్​ను గాయపరిచా: అక్తర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.