ETV Bharat / sports

ఇషాన్, అయ్యర్​పై బీసీసీఐ సీరియస్!- యంగ్ ప్లేయర్లపై డిసిప్లైన్ యాక్షన్! - Ishan Kishan t20 2024

Ishan Kishan Shreyas Iyer Break: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు ఇషాన్ కిషన్​, శ్రేయస్ అయ్యర్​ పట్ల బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ సిరీస్​కు వారిని ఎంపిక చేయకపోడానికి కారణం ఇదేనంటూ పలు వార్తలు వస్తున్నాయి! అసలేం జరిగిందంటే?

Ishan Kishan Shreyas Iyer Break
Ishan Kishan Shreyas Iyer Break
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 8:08 PM IST

Updated : Jan 10, 2024, 9:21 PM IST

Ishan Kishan Shreyas Iyer Break: టీమ్ఇండియా యంగ్​ ప్లేయర్ ఇషాన్ కిషన్​, అఫ్గానిస్థాన్​తో జనవరి 11 నుంచి జరిగే టీ20 సిరీస్​కు ఎంపిక కాలేదు. అటు శ్రేయస్ అయ్యర్​ను కూడా సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. ఇషాన్ 'మానసిక ఒత్తిడి' కారణంగా ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే భారత్​కు వచ్చాడు. అయితే అఫ్గాన్​తో జరిగే సిరీస్​ కోసం అందుబాటులో ఉంటానని ఇషాన్ రీసెంట్​గా బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లిడట. కానీ, బీసీసీఐ అతడిపై డిసిప్లినరీ చర్యల్లో భాగంగానే అతడిని ఎంపిక చేయలేదని పలు కథనాలు వెలువడుతున్నాయి.

ఆటకు బ్రేక్ తీసుకున్న ఇషాన్ ఇటీవల టీమ్ఇండియా మహిళా క్రికెటర్​ స్మృతి మంధాన్నతో కలిసి అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' గేమ్ షో​లో పాల్గొన్నాడు. అలాగే తాజాగా ఇషాన్ దుబాయ్​లో ఓ పార్టీలో పాల్గొన్న ఫొటో బయటకు రావడం వల్ల బీసీసీఐ అతడిపై కోపంగా ఉందట. ఫ్యామిలీతో గడిపేందుకు బ్రేక్ తీసుకొని ఇషాన్ ఇలా చేయడం వల్ల మేనేజ్​మెంట్ అతడిపై నమ్మకం కోల్పోయిందంటూ పలు కథనాలు వస్తున్నాయి.

అటు శ్రేయస్ అయ్యర్ కూడా ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ముందు రంజీ ట్రోఫీ ఆడడం పట్ల అతడిపై బీసీసీఐ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యర్ 2024 రంజీలో ముంబయి తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జనవరి 12న ముంబయి- ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సమయంలో రంజీలో ఆడాలని మేనేజ్​మెంట్ అయ్యర్​కు సూచించిందట. కానీ, అయ్యర్ అప్పుడు నో చెప్పి, తాజాగా ముంబయితో అగ్రిమెంట్ చేసుకోవడాన్ని బీసీసీఐ తప్పుపట్టినట్లు సమాచారం.

అలాంటిదేమీ లేదు: అయితే 'ఇషాన్​, అయ్యర్​ను క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే పక్కనపెట్టారా?' అన్న ప్రశ్నకు టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రిప్లై ఇచ్చాడు. 'అలా కాదు. ఈ విషయంలో వస్తున్నవన్నీ ఫేక్ వార్తలు. ఇషాన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అయ్యర్ ఈ సిరీస్ సెలెక్షన్​కు దూరంగా ఉన్నాడు' అని ద్రవిడ్ అన్నాడు.

టీ20 వరల్డ్​కప్​నకూ నో!: 2024 టీ20 వరల్డ్​కప్​నకు ముందు టీమ్ఇండియాకు ఈ సిరీస్​ మినహా పొట్టి ఫార్మాట్​ మ్యాచ్​లు లేవు. ఒకవేళ ఈ సిరీస్​లో వికెట్ కీపర్​గా ఎంపికైన జితేశ్ శర్మ లేదా సంజూ శాంసన్ అఫ్గాన్​పై రాణిస్తే ఇషాన్​కు పొట్టికప్​ జట్టులో చోటు కష్టమే! ఇక మిడిల్​ ఆర్డర్​లో తిలక్ వర్మ సమర్థంగా పరుగులు చేయగలిగితే అయ్యర్ ప్లేస్​ కూడా అనుమానమే.

అందులో తప్పేముంది? అయితే ఇషాన్ విషయంలో అతడికి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. 'పలు కారణాల వల్ల ఆటకు బ్రేక్ తీసుకున్న ప్లేయర్ పార్టీలకు వెళ్తే తప్పేముంది', మానసిన ఒత్తికిడి లోనైన ఇషాన్ రిఫ్రెష్​మెంట్​ కోసం ఎక్కడికైనా వెళ్లవచ్చు' అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

భారత్​ x అఫ్గాన్​ - ఇంట్రెస్టింగ్​గా ప్లేయింగ్​ 11 - ఆడేదెవరు? ఆగేదెవరు?

అఫ్గాన్​ జట్టుకు ఊరట - ఆ ముగ్గురిపై బ్యాన్​ ఎత్తివేత

Last Updated : Jan 10, 2024, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.