Ishan Kishan Ind vs Aus T20 Series : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో విజయంతో టీమ్ఇండియా 2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. అయితే మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
బ్యాటింగ్ సరదాగా ఉంది.. యంగ్ డైనమిక్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు 50+ స్కోర్లు నమోదు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో అతడు 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సాధారణంగా వైట్‌బాల్ క్రికెట్లో ఇషాన్ ఓపెనింగ్ బ్యాటర్. 2023 ఆసియా కప్‌లో జట్టు అవసరాన్ని బట్టి మిడిలార్డర్లోనూ ఆడాడు. ఈ క్రమంలో తాజా సిరీస్‌లో వన్‌డౌన్‌లో వస్తున్నాడు. దీనిపై ఇషాన్ మాట్లాడాడు.
"వన్ డౌన్లో బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంటుంది. ఎందుకంటే 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లేటప్పటికి మనకు మ్యాచ్ పరిస్థితి అర్థమవుతుంది. దీంతో మనం ఎలా ఆడలని ప్లాన్ చేసుకుంటామో.. అలా ఆడవచ్చు. కానీ, క్రీజులోకి వెళ్లి స్ట్రైక్ రొటేట్ చేయడం అన్నిసార్లు సాధ్యం కాదు. ఈ మ్యాచ్‌లో మొదట్లో నేనూ కొద్దిగా ఇబ్బంది పడ్డా. కానీ, రుతురాజ్‌తో నాకు మంచి కమ్యునికేషన్ కుదరడం వల్ల.. బౌలర్లను టార్గెట్ చేయగలిగాం" అని ఇషాన్ అన్నాడు.
-
A win by 44 runs in Trivandrum! 🙌#TeamIndia take a 2⃣-0⃣ lead in the series 👏👏
— BCCI (@BCCI) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/nwYe5nOBfk#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/sAcQIWggc4
">A win by 44 runs in Trivandrum! 🙌#TeamIndia take a 2⃣-0⃣ lead in the series 👏👏
— BCCI (@BCCI) November 26, 2023
Scorecard ▶️ https://t.co/nwYe5nOBfk#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/sAcQIWggc4A win by 44 runs in Trivandrum! 🙌#TeamIndia take a 2⃣-0⃣ lead in the series 👏👏
— BCCI (@BCCI) November 26, 2023
Scorecard ▶️ https://t.co/nwYe5nOBfk#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/sAcQIWggc4
లేటెస్ట్ ఫినిషర్.. మరోసారి తన ఫినిషింగ్‌తో అందరినీ అలరించాడు రింకూ సింగ్. ఈ మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగిన రింకూ.. కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ ముగిశాక రింకూ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. "జట్టులో నేను ఎలాగో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తా. నాకు అది ముందే తెలుసు. ఆ సమయంలో నేను వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా గేమ్‌పైనే దృష్టిపెట్టాను. బంతిని సరిగ్గా అంచనా వేసిన తర్వాతే భారీ షాట్ ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. జట్టులో యువ క్రికెటర్లుగా మేము చాలా నేర్చుకుంటున్నాం. ఆఖరి 5 ఓవర్లలో బ్యాటింగ్ చేయడమే నా రోల్. దాని కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నా" అని రింకూ అన్నాడు.
సారీ చెప్పేశా.. తొలి మ్యాచ్‌లో సమన్వయం కోల్పోయి, తన వల్ల రుతురాజ్ ఔటయ్యాడని యశస్వి జైశ్వాల్ గుర్తుచేసుకున్నాడు. "ఫస్ట్ మ్యాచ్‌లో రతురాజ్ రనౌటవ్వడంలో నా తప్పే ఉంది. అందుకు నేను రుతు భాయ్‌కు సారీ చెప్పాను. రుతురాజ్ నైస్ పర్సన్" అని జైశ్వాల్ అన్నాడు.
'రింకూలో ఆ టాలెంట్ గుర్తించింది అతడే' - ధోనీ నుంచే ఆ ట్రిక్ నేర్చుకున్నాడట!
నన్ను నేనే అలా ప్రశ్నించుకునేవాడిని- అదే ఇప్పుడు సాయం చేసింది : ఇషాన్ కిషన్